Home » Dec 31st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 31st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఢీల్లీ ఎన్సీఆర్ లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం నెల‌కొంది. భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం అమ‌లు చేశారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 369 పాయింట్లుగా గాలి నాణ్యత ఉండ‌గా నోయిడా లో 388 పాయింట్లుగా ఉంది.

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ విరమణ పొందారు. నేడు ప‌రేడ్ గ్రౌండ్ లో పోలీస్ గౌరవ వందనం స్వీకరించి ఆయ‌న ప‌ద‌వీవిర‌మ‌ణ పొందారు.

Advertisement


తిరుమలలో 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 63,253 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియలో గందరగోళం నెల‌కొంది. ఇప్పటికీ గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాలేదు.ఈనెల 23వ తేదీ నుంచే దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

తిరిగి కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్తలపై గులాంనబీ ఆజాద్ స్పందించారు. ఆ కథనాలు చూసి షాక్ అయ్యానని చెప్పారు. ఒక వర్గం నాయకులు ఇలాంటి ప్రచారం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement

తెలంగాణ బీజేపీ సమావేశంలో టీడీపీతో పొత్తుపై హాట్‌ హాట్‌ చర్చ జ‌రిగింది. టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాల‌ని మాజీ ఎంపీ విజయశాంతి కోరారు. దాంతో తెలంగాణలో టీడీపీతో పొత్తు ఉండదని బండి సంజ‌య్ స్ప‌ష్టం చేశారు.

నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి తర్వాత కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్ర‌క‌టించింది. దాంతో సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమాకు ఎంఎంటీఎస్ రైళ్లు న‌డ‌వ‌నున్నాయి.

సంక్రాంతి పండుగ కోసం ఏపీ తెలంగాణ‌లో మరో 16 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే స్ప‌ష్టం చేసింది.

ఏపీలో రైతుల నుంచి రూ.3,780 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. 3,29,862 మంది రైతుల నుంచి 18.52 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఏపీ ప్రభుత్వం వెల్ల‌డించింది.

Visitors Are Also Reading