ఎక్కువ మందిని చూపించడానికి కందుకూరులో సభపెట్టారు. చంద్రబాబు అధికార దాహం వల్ల కందుకూరు ప్రమాదం జరిగింది. ఇరుకు సందులో బస్సు యాత్ర పెట్టారు. లేనిది ఉన్నట్లు చూపే ప్రయత్నం వల్లే ప్రమాదం జరిగింది. 8మంది కుటుంబాలు వీధిన పడ్డాయి అంటూ వైసిపి మంత్రి కాకాణి చంద్రబాబు పై ఆరోపణలు చేశారు.
హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఉదయం 10.30 గంటలకు మీటింగ్ జరగనుంది. ఏపీ అభివృద్ధితో పాటు పలు అంశాలపై చర్చ జరగనుంది.
Advertisement
కందుకూరు ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నెల్లూరు కందుకూరు తొక్కిసలాటలో ఎనిమిది మంది చనిపోగా ఈ ఘటనపై కేసు నమోదు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 174 క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా నిన్న శ్రీవారిని 71,299 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఏజెన్సీల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అల్లూరి జిల్లా మినుములూరులో 13 డిగ్రీలు, పాడేరులో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
కేరళ, తమిళనాడులో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. PFI సంస్థలకు చెందిన నేతల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. సెప్టెంబర్‌లో PFIపై కేంద్రం నిషేదం విధించింది. మరో పేరుతో సంస్థ ఏర్పాటుకు PFI ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.
ఏప్రిల్ 3 నుంచి 11 వరకు తెలంగాణ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలను ఇకపై 6 పేపర్లకు కుదించారు. వందశాతం సిలబస్‌తో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షల్లో ప్రతీ సబ్జెక్టుకు 3 గంటలకు పరీక్షా సమయం పట్టనుంది.
తెలంగాణలో చలికాలంలోనూ రికార్డుస్థాయిలో విద్యుత్‌కు డిమాండ్ ఏర్పడింది. ఉదయం 7 గంటల వరకే 13,555 మెగావాట్ల డిమాండ్.. నిన్న ఉ.7 గంటల వరకు 13,403 మెగావాట్ల వినియోగం.. మోటార్ల వినియోగం ఎక్కువ కావడంతో విద్యుత్‌కు భారీ డిమాండ్ పెరిగినట్టు తెలుస్తోంది.