కడప ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం వైఎస్ జగన్ నేడు నివాళ్లు అర్పించారు.
Advertisement
కోవిడ్ సన్నద్ధతపై దేశంలోని ఆస్పత్రల్లో ఈ నెల 27న మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్లు, అంబులెన్స్ సేవలపై మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.
శబరిమల యాత్రలో విషాదం చోటు చేసుకుంది. అయ్యప్ప భక్తుల వ్యాన్ బోల్తా పడడంతో 8 మంది చనిపోయారు. తమిళనాడు లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో పోలీసులు మావోయిస్ట్ ల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు.
వచ్చే ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానానికి ఇండిపెండెంట్‌గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయనున్నారు.
Advertisement
ఢిల్లీలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. బదర్‌పూర్ సరిహద్దు నుంచి ఢిల్లీలోకి ఎంట్రీ.. ఇవాళ ఎర్రకోట వరకు జోడో యాత్ర సాగనుంది. నేడు యాత్రలో నటుడు కమల్ హాసన్ పాల్గొంటారు.
నేడు మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఢిల్లీ సెంట్రల్ హాల్ లో సోనియాగాంధీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. పార్టీ విషయాలపై రేవంత్ రెడ్డి సోనియమ్మ తో చర్చించారు.
కరోనా విషయం లో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. రాబోయే పండుగ సీజన్లు. న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని, ‘టెస్ట్-ట్రాక్-ట్రీట్, వ్యాక్సినేషన్’పై దృష్టి సారించాలని పేర్కొంది. మాస్క్ ధరించడం, చేతుల పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ పాటించడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను ఆదేశించింది.