Home » Dec 15th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Dec 15th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హర్యానాలో దొంగల ముఠా హల్ చల్ చేసింది. బాలాజీనగర్ లో ఏటీఎం దోపిడీకి ప్రయత్నం చేశారు. గ్యాస్ సిలిండర్, కట్టర్లు, స్ప్రేయర్లు తెచ్చిన ముఠా, వాటిని వదిలి పరార్ అయ్యారు. పోలీసులపై 3 రౌండ్ల కాల్పులు జరిపారు.

బీహార్ లో విషాదం చోటు చేసుకుంది. సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి నిన్న 21 మంది మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9మంది మృతిచెందారు.

Advertisement

నేడు కాంగ్రెస్ పిటిషన్ పై విచారణ జరగనుంది. పిటిషన్ దాఖలు చేసిన మల్లు రవి.. సునీల్ కనుగోలు టీం… ఆఫీసులో పోలీసుల దాడి పై పిటిషన్ చేయనున్నారు. ఎలాంటి నోటీస్ లేకుండా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని, ముగ్గురి ఆచూకీ తెలియడం లేదని పిటిషన్లో మల్లు రవి పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.. నాలుగు రోజులుగా ఢిల్లీలోనే కేసీఆర్.. నిన్న BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. BRS కార్యక్రమాలు, రైతు నేతలతో సమావేశాలపై కేసీఆర్ దృష్టి సాధించారు.

Advertisement

తిరుమల కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 59,752 మంది భక్తులు దర్శించుకున్నారు.

ఈ నెల 28వ తేదీన భద్రాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేస్తున్నారు. రాములోరి దర్శనం కోసం రాష్ట్రపతి విచ్చేస్తున్నారు.

తిరుమలకి సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ చేరుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారిని రజినీ దంపతులు శ్రీవారిని దర్శంచుకోనున్నారు.

నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ముగింపు పలకనున్నారు. కరీంనగర్‌లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విచ్చేయనున్నారు.

ఏపీ, తెలంగాణ ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజనలో ఆలస్యంపై పిటిషన్‌ దాకలు చేశారు. ఈ షెడ్యూల్ లో ఉన్న సంస్థల విలువ దాదాపు రూ.1,42,601 కోట్లు కాగా షెడ్యూల్‌ 9, 10 సంస్థలు దాదాపు 91 శాతం తెలంగాణలోనే ఉన్నాయని ఏపి సర్కార్ ఆరోపిస్తోంది.

Visitors Are Also Reading