ఐపీఎల్-16 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను డేవిడ్ వార్నర్ తన వ్యూహాలతో అద్భుతంగా ముందుండి నడిపిస్తాడని ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఈ సీజన్ కు అందుబాటులో లేకపోవడంతో వార్నర్ ని సారథిగా నియమించిన విషయం తెలిసిందే. అయితే వార్నర్ కు ఐపీఎల్ లో కెప్టెన్సీ కొత్తేమీ కాదు.
READ ALSO :ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..?
Advertisement
చాలా కాలం పాటు సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన అతడు 2016లో ఎస్ ఆర్ హెచ్ ని ఛాంపియన్ గా నిలిపాడు. 2021లో అతడు కొన్ని మ్యాచ్ ల్లో పేలవమైన ఆటతీరును కనబరిచాడు. దీంతో హైదరాబాద్ అతడిని తుది జట్టు నుంచి తప్పించింది. 2022 వేలంలో అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోగా, ఆ సీజన్ లో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 432 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ పై షేన్ వాట్సన్ కీలక వాక్యాలు చేశాడు.
Advertisement
READ ALSO : TS Constable : ఏప్రిల్ 2న పోలీస్ కానిస్టేబుల్ తుది రాతపరీక్ష..కచ్చితంగా ఈ రూల్స్ పాటించండి
వార్నర్ ని వదులుకొని సన్రైజర్స్ పెద్ద తప్పు చేసిందన్నారు. ‘డేవిడ్ వార్నర్ అద్భుతమైన నాయకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఐపీఎల్ లో అతను ప్రతిసారి రాణించాడు. మూడు, నాలుగు మ్యాచ్ ల్లో వార్నర్ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. దీంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించి సన్రైజర్స్ పెద్ద తప్పు చేసింది’ అని షేన్ వాట్సన్ అన్నాడు.
READ ALSO : అమితాబ్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్..నైట్ పార్టీలో ఆ పనులు ?