గత ఏడాది వరకు ఐపీఎల్ లో సన్ రైజర్స్ గైదరాబాద జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్… ఈ ఐపీఎల్ 2022 లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో మొదటి మూడు మ్యాచ్ లు మిస్ అయిన వార్నర్.. గత మూడు మ్యాచ్ ల నుండి ఢిల్లీ ఓపెనర్ గా ఉన్నాడు. అయితే నిన్న రాయల్స్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో ఢిల్లీ తలపడిన సమయంలో… వార్నర్ కూతుర్లను ఆర్సీబీ బౌలర్ హాసరంగా ఏడిపించాడు.
Advertisement
అసలు ఏం జరిగిందంటే.. నిన్నటి మ్యాచ్ లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన ఢిల్లీ మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత వార్నర్ 38 బంతుల్లో 66 పరుగులు చేయడంతో రేస్ లోకి తిరిగి వచ్చింది ఢిల్లీ. కానీ అదే సమయంలో హాసరంగా బౌలింగ్ లో వార్నర్ ఔట్ అయ్యాడు. మొదట దీనిని అంపైర్ నాటౌట్ గా ఇచ్చిన… ఆర్సీబీ రివ్యూ తీసుకోవడంతో.. అందులో ఔట్ గా వచ్చింది.
Advertisement
దాంతో నిరాశగా పెవిలియన్ కు వస్తున్న తమ తండ్రిని చూసి… వార్నర్ కూతుర్లు ఏడవటం ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోను వార్నర్ భార్య ట్విట్టర్ లో పోస్ట్ చేసి… తమ తండ్రి ఔట్ కావడంతో కూతుర్ల గెండె పగిలిపోయింది అంటూ రాసుకొచ్చింది. ఇక గత ఐపీఎల్ కు 12 కోట్లకు పైగా అందుకున్న వార్నర్ ను వేలంలో ఢిల్లీ 6.25 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇది కూడా చదవండి :
ఐపీఎల్ or లవర్ : మీ సమాధానం ఏంటి..?
ముంబై పని ఖతం.. గుడ్ బై చెప్పిన ఫ్యాన్స్…?