ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన 11వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. ఢిల్లీలోని మిగిలిన బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ చేయని చోట వార్నర్ ఒంటరి పోరాటం చేసి జట్టుకు పరుగులు జోడించినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించుకోలేకపోయాడు.
Also Read : IPL 2023 : డబ్బుల కోసం ముంబై కుర్చీల వ్యాపారం…. ఒక్కోటి ఎంతంటే!
Advertisement
ఐపీఎల్ లో అత్యంత వేగంగా 6వేల పరుగులు పూర్తి చేసిన రికార్డు గతంలో విరాట్ పేరిట ఉంది. కోహ్లీ 188 ఇన్నింగ్స్ లో 6వేల పరుగులు పూర్తి చేసాడు. మరోవైపు అత్యంత వేగంగా 6వేల పరుగులు చేసిన మూడో ఆటగాడిగా శిఖర్ ధావన్ ఉన్నాడు. ధావన్ 199 ఇన్నింగ్స్ లో ఈ మైలు రాయిని చేరుకున్నాడు. రాజస్థాన్ పై వార్నర్ తన ఐపీఎల్ కెరీర్ లోనే 57వ హాఫ్ సెంచరీ చేశాడు. అతని పేరు మీద 4 సెంచరీలున్నాయి.
Advertisement
Also Read : IPL చీర్ లీడర్స్ జీతమెంతో తెలుసా? క్రికెటర్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారుగా !
ఇవాళ 44 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ఢిల్లీ తరుపున వార్నర్ ఈ మ్యాచ్ లో పోరాడడమే కాకుండా.. రెండు మ్యాచ్ లలో కూడా అతని బ్యాట్ నుంచి పరుగుల వర్షం కురుస్తోంది. డేవిడ్ వార్నర్ గుజరాత్ పై 37 పరుగులు, లక్నో సూపర్ జేయింట్స్ పై 56 పరుగులు చేశాడు. రాజస్థాన్ పై 55 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఈ సమయంలో 7 ఫోర్లు కొట్టాడు. చివరికీ యజ్వేంద్ర చాహల్ కి బలయ్యాడు.
Also Read : ఆఫర్స్ లేకున్నా… కూతురి కోసం కాస్ట్లీ కారు కొన్న సురేఖ వాణి