Home » గొంతులో ఆహారం ఇరుక్కుంటే చాలా ప్రమాదం.. అయితే ఇలా చేయండి..!

గొంతులో ఆహారం ఇరుక్కుంటే చాలా ప్రమాదం.. అయితే ఇలా చేయండి..!

by Anji

సాధారణంగా చాలా మంది ఆహారం తినేటప్పుడు గొంతులో ఏదైనా ఇరుక్కున్నపుడు పొరపోయిందని.. ఎవరో తలచుకుంటున్నారని అనటం చూస్తునే ఉంటాం. ఇది ఏమంత సమస్య కాదని భావించేవారు ఎక్కువగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆహారం గొంతులో ఇరుక్కుపోయి మరణం సంభవిస్తుంది. ఆహారం తినేటప్పుడు పొలమారి ఉక్కిరిబిక్కిరై మరణించిన  ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయితే.. మనం తిన్న ఆహారం కిందికి కదలడానికి వీలుగా తలపై కొందరూ తడుతుంటారు. అయితే.. ఆ ఆహారం ఆహార నాళంలోకి కాకుండా, ఊపిరితిత్తుల్లోకి వెళ్లాల్సిన వాయునాళంలోకి పోతే ప్రమాదం ఉంటుందని వైద్యులంటున్నారు. కావునా..ఆ ఆహారం బయటకు రావడానికి వీలుగా దగ్గమని చెప్పాలని సూచిస్తున్నారు.

ఆహారం శ్వాసనాళాల్లో అడ్డుపడితే..ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. దీనినే అస్ఫిక్సియా అని  పిలుస్తారు. శ్వాసనాళాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు.. ఆక్సిజన్ అందక గుండె, మెదడు పనిచేయవు. దీంతో పరిస్థితి క్లిష్టంగా ఉంటుంది. తినే సమయంలో ఆహారం గొంతులో ఇరుక్కుపోవడాన్ని తేలికగా తినాలి. ఆహారం, మరేదైనా వాయుమార్గంలో చిక్కుకుపోతే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. అనంతరం దగ్గు, గురక, వికారం, అస్పష్టమైన మాటలు, స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి సమయంలో కచ్చితంగా 8 నుంచి 15 నిమిషాల్లో వైద్యం ప్రారంభించాలి. లేకపోతే రోగిని రక్షించడం కష్టం అవుతుంది. ఆహారం గొంతులో చిక్కుకుపోయినప్పుడు వీపు మీద తట్టితే ప్రమాదం నుంచి రక్షించవచ్చు.

అదేవిధంగా.. గొంతులో చిక్కుకుపోయినప్పుడు అతని వెనుక నుంచి పట్టుకుని చేతులు, కడుపు, పక్కటెముకలపై గట్టిగా పట్టుకుని వీపుపై తట్టితే.. గొంతులో ఇరుక్కున్న ఆహారం నోటి ద్వారా బయటకు వస్తుంది. ఈ విధంగా చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు. హేమ్లిచ్ మ్యాన్యువర్‌ పద్ధతిని సంవత్సరం పిల్లలకు, గర్భిణీ మహిళలపై ఉపయోగించకూడదు. చిన్న పిల్లల్ల గొంతులో ఏదైనా ఆహార పదార్థం ఇరుక్కుంటే పిల్లలను కాళ్లపై బోర్లా పడుకోబెట్టాలి. ఇలా పడుకోబెట్టినప్పుడు పిల్లల తల కిందికి ఉండేలా చూడాలి. ఇలా చేస్తే గొంతులో ఇరుకున్న పదార్థం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటే వెంటనే ఆస్పత్రికి తరలించాలి. అక్కడ కొన్ని లారింగోస్కోపీ అనే పరికరంతో గొంతును పరీక్ష చేసి.. అనంతరం అక్కడ ఇరుక్కున్న పదార్థాన్ని తొలగిస్తారు డాక్టర్లు.

 

Visitors Are Also Reading