Home » VIRAL VIDEO : విదేశాల్లో అఖండ మాస్ జాత‌ర‌…డ‌ల్లాస్ లో అభిమానుల భారీ కార్ ర్యాలీ..!

VIRAL VIDEO : విదేశాల్లో అఖండ మాస్ జాత‌ర‌…డ‌ల్లాస్ లో అభిమానుల భారీ కార్ ర్యాలీ..!

by AJAY
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. బాల‌య్య సినిమా వ‌చ్చిందంటే థియేట‌ర్ల వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంది. ఇక మిగ‌తా ద‌ర్శ‌కుల‌తో బాల‌య్య సినిమా రావ‌డం ఒక ఎత్తు అయితే మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటితో బాల‌య్య సినిమా చేయ‌డం మ‌రో ఎత్తు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్ లాంటి సినిమాలు ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డంతో వీరి కాంబోలో వ‌చ్చిన మూడో సినిమా అఖండ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఈ రోజు అఖండ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన సంగితి తెలిసిందే.

DALLAS BALAYYA FANS CAR RALLY

DALLAS BALAYYA FANS CAR RALLY

ఈ నేప‌థ్యంలో ఆంధ్రాతెంగాణ‌లోనే కాకుండా విదేశాల్లోనూ అఖండ మాస్ జాత‌ర‌ను సాగుతోంది. తాజాగా డ‌ల్లాస్ లో బాల‌య్య అభిమానులు చేసిన కార్ ర్యాలీ నెట్టింట వైర‌ల్ అవుతోంది. కార్ ర్యాలీలో తెలుగు దేశం జండాల‌తో….బాల‌య్య ఫోటోల‌తో అభిమానులు కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని ఓ థియేట‌ర్ లో బాల‌య్య అభిమానుల అరుపులు హంగామాకి యాజ‌మాన్యం భ‌య‌ప‌డిపోయిందట‌.

Advertisement

Advertisement

బాలయ్య “అఖండ” ట్విట్టర్ రివ్యూ…!

అంతే కాకుండా యాజ‌మాన్యం అల్ల‌రి ఆపేయ‌కుంటే సినిమా ఆపేస్తామ‌ని మ‌ధ్య‌లోనే సినిమాను కట్ చేసింద‌ట‌. ఇక మ‌ళ్లీ కాసేప‌టికి సినిమా ప్ర‌సారం చేయ‌గా అభిమానులు మ‌ళ్లీ హంగామా సృష్టించార‌ట‌. దాంతో యాజమాన్యం ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిందట‌. దీనికి సంబంధించిన చాటింగ్ స్క్రీన్ షాట్ లు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఏపీలోని ప‌లు థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల సంబురాలు క‌నిపిస్తున్నాయి. ఓ థియేట‌ర్ వ‌ద్ద చిన్నా పెద్దా తేడాలేకుండా అర‌వై ఏళ్ల వ్య‌క్తులు స్టెప్పులు వేస్తున్నారు. బాల‌య్య పోస్ట‌ర్ ల‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు.

Visitors Are Also Reading