ప్రస్తుతం మొత్తం సోషల్ మీడియా.. ఇంటర్నెట్ యుగం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందరూ ఫెస్ బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ అటు ఇలా చాలా రకాలైన సోషల్ మీడియా మాధ్యమాలను వాడుతున్నారు. అందులో తమ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.
Advertisement
ఇక కొంత మంది అయితే తమ భార్యల ఫోటోలను ఉంచుతున్నారు. కొందరు ఫెస్ బుక్ లో పోస్ట్ చేస్తే.. ఇంకొందరు ఇంస్టా స్టోరీలో ఉంచున్నారు. అలాగే మరి కొందరు వాట్సాప్ డీపీగా పెట్టుకుంటున్నారు. అయితే ఇలా చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీకు కూడా చెన్నైలోని అయ్యన్నవరం ప్రాంతానికి చెందిన వ్యక్తికి జరిగిన విధంగానే జరగవచ్చు.
అయితే ఇప్పుడు ఉన్న ఇంటర్నెట్ కాలంలో సైబర్ నేరాలు ఎక్కువై పోయాయి. ఇప్పుడు ఇందులో కొత్త రకం నేరాలు వచ్చాయి. వాటికీ ఇలా భార్యల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టుకున్న భర్తలే టార్గెట్. ఈ అయ్యన్నవరం కీ చెందిన వ్యక్తి కూడా తన భార్య ఫోటోను డీపీగా ఉంచుకున్నాడు. అయితే ఆ ఫోటోను కాపీ చేసుకున్న సైబర్ నేరగాడు.. ఆ ఫోటోను ఎడిటింగ్ లో నగ్న ఫోటోగా మార్చేశాడు. దానిని మళ్ళీ ఆ భర్తకు పంపి.. తనకు డబ్బు ఇవ్వాలని లేకుంటే.. ని భార్య నగ్న ఫోటోను మొత్తం షేర్ చేస్తాను అని బెదిరించడం మొదలు పెట్టాడు.
Advertisement
దాంతో ఏం చేయాలో అర్ధం కానీ ఆ భర్త నేరుగా ఆ ప్రాంతానికి చెందిన పోలీసులను ఆశ్రయించాడు. వారు దానిని సైబర్ వింగ్ కు అప్పగించగా… ఆ బ్లాక్ మెలర్ యూజర్ ఐడీని ట్రాక్ చేసి వాడిని పట్టుకునే పనిలో పడ్డారు. అయితే ఈ కేసులో మరో కోణం కూడా ఉండవచ్చు అని పోలీసులు అనుకుంటున్నారు. తేలినవారు కానీ లేక తన భార్యకు పరిచయం ఉన్న వ్యక్తులే ఎవరైనా డబ్బు కోసం ఇలాంటి పనులకు పాల్పడుతుండవచ్చు అని అనుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీ భార్యల ఫోటోలను ఇలా సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఇవి కూడా చదవండి : హార్దిక్ పాండ్య డ్రీమ్ ఐపీఎల్ కాదంట.. ఏంటో తెలుసా మరి..?
కోహ్లీకి ఇదే మంచి సమయం.. ఆ పని చేయడానికి..!