టాలీవుడ్ అక్కినేని హీరో నాగచైతన్య నటించిన తాజా చిత్రం “కస్టడీ”. ఈ మధ్య కొత్త కొత్త కథలను ఎంచుకుంటూ హీరోగా తమ మార్కెట్ మరింత వంచుకునే దిశగా నాగచైతన్య అడుగులు వేస్తున్నాడు. ఇందులో నాగచైతన్యకు జోడిగా తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక తమిళ సీనియర్ నటులు శరత్ కుమార్ మరియు అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా థ్రిల్లర్ యాక్షన్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కించే వెంకట్ ప్రభు ఈ సినిమాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇవాళ అపేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ రివ్యూ ఇప్పుడు చూసేద్దాం.
READ ALSO : Ustaad Bhagatsingh: “ఉస్తాద్” ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందిరోయ్.. పవన్ ఫ్యాన్స్ కు ఇక జాతరే
Advertisement
కథ మరియు వివరణ:
కస్టడీ కథ విషయంలోకి వెళితే… శివ (నాగచైతన్య) నిజాయితీగల కానిస్టేబుల్. తాను ప్రేమించిన రేవతి (కృతి శెట్టి)ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు. అయితే సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్ లో రాజన్న (అరవింద స్వామి)ని అరెస్టు చేసి ఉంచుతారు. అదే టైం డ్యూటీ లో ఉన్న శివకి రాజన్నని ఎవరో చంపేస్తున్నారు అని తెలుస్తుంది. ఇంకోవైపు రేవతికి వేరే పెళ్లి నిశ్చయించడంతో వేరే దారి లేక, శివ ఎలాగైనా న్యాయం గెలవాలి, రాజన్నని కోర్టులో అప్పగించాలని, అదే రాత్రి ఇటు రేవతితో పాటు రాజన్నని కూడా తీసుకెళ్తాడు. దీంతో శివ కోసం మరియు రాజన్న కోసం పోలీసులు గాలించడం మొదలు పెడతారు. అసలు రాజన్నని ఎవరు చంపాలి అనుకున్నారు, శివ ఈ పోరాటంలో గెలిచాడా లేదా అనేది మిగతా కథ.
Advertisement
READ ALSO : పవన్ కళ్యాణ్ సినిమాపై పూనమ్ ఫైర్.. భగత్ సింగ్‌ను కించపర్చడమేనంటూ ట్వీట్
నెమ్మదిగా మొదలైన కస్టడీ మూవీ… ప్రీడిక్టబుల్ నేరేషన్ తో సాగుతుంది. ఇంటర్వెల్ వరకు దర్శకుడు సినిమాను రొటీన్ సన్నివేశాలతో లాగిన్ చేశాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్వాలేదు అంటున్నారు. ఈ సినిమాకు ప్రధాన మైనస్ సాంగ్స్ అన్నమాట వినిపిస్తోంది. సాంగ్స్ విషయంలో కస్టడీ పూర్తిగా నిరాశపరుస్తుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజ సాంగ్స్ పరంగా మెప్పించలేకపోయారంటున్నారు.
ప్లస్ పాయింట్లు:
కథ
యాక్షన్
చైతూ
కృతి సనన్
మైనస్ పాయింట్లు :
సాగదీత
సాంగ్స్
సీన్స్ బోరింగ్
సినిమా రేటింగ్: 2.5/5
Read also : సీఎం పదవి అడుగుతా.. పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన