Home » బిగ్ బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీకి క‌రెంటు షాక్

బిగ్ బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీకి క‌రెంటు షాక్

by Bunty
Ad

బిగ్ బాస్ తెలుగు సిజ‌న్ – 5 ను వీజే స‌న్నీ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే వీజే స‌న్నీ బిగ్ బాస్ సీజ‌న్ – 5 గెలిచిన అనంత‌రం ప్రెస్ మీట్ నిర్వ‌హించాడు. ఈ ప్రెస్ మీటుకు అన్నీ మీడియా ఛాన‌ల్స్ తో పాటు న్యూస్ పేప‌ర్స్ కూడా వ‌చ్చాయి. అలాగే యూట్యూబ్ ఛానల్స్ ప్ర‌తినిధులు వ‌చ్చారు. ఈ సంద‌ర్భం గా బిగ్ బాస్ హౌస్ లో త‌న అనుభావాల‌ను పంచుకున్నాడు. అయితే అలాగే రిపొర్టర్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బిగ్ బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ స‌మాధానాలు కూడా చెప్పాడు. అయితే ఒక సంద‌ర్భంలో ఫోన్ లో ఒక విడీయో క్లిప్పింగ్ చూపించే క్ర‌మంలో వీజే స‌న్నీకి క‌రెంటు షాక్ త‌గిలింది.

Advertisement

Advertisement

ఈ ఆక‌స్మ‌త్తు ప‌రిమాణానికి అందరూ ఒకే సారి ఆశ్చ‌ర్యానికి గురి అయ్యారు. అయితే వీజే స‌న్నీకి షాక్ చిన్న పాటిదే కావ‌డం, అలాగే ఈ ప్ర‌మాదం లో ఎవ‌రికీ ఎలాంటి హానీ జ‌ర‌గ‌క పోవ‌డం తో అక్క‌డ ఉన్న వారు అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతుంది. అయితే ఈ ఏడాది బిగ్ బాస్ సీజ‌న్ తెలుగు – 5 విన్న‌ర్ గా వీజే స‌న్నీ గెలిచాడు. ర‌న్న‌ర్ గా యూట్యూబ‌ర్ ష‌ణ్ముక్ జ‌శ్వంత్ నిలిచాడు.

Visitors Are Also Reading