ఐపిఎల్ 2023 సీజన్ కు కౌంట్ మొదలైంది. ఈ తరుణంలోనే మహేంద్రసింగ్ ధోని సారాధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ – మరోసారి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి. 2021 సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన సీఎస్కే ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ లో ఆడబోతోంది. ధోని సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది. మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్ ను మట్టి కరిపించింది.
Advertisement
ధోని సేన గుజరాత్ పై చెన్నై 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. చెన్నైను నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని GT ఛేదించలేకపోయింది. అయితే గుజరాత్ చేదనలో చాలా వెనుకబడి ఉంది. 24 బంతుల్లో 71 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. పతిరణకు తన కోటలో ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే పతిరనా 16వ ఓవర్ వేసే ముందు మైదానంలో నిర్దిష్ట సమయం గడపకుండా, నేరుగా డగౌట్ నుంచి వచ్చి బౌలింగ్ వేసేందుకు సిద్ధపడ్డాడు.
Advertisement
నిబంధనల ప్రకారం బౌలింగ్ వేయడానికి ముందు బౌలర్ కచ్చితంగా 9 నిమిషాల పాటు మైదానంలో గడపాలి. అలాకాకుండా పతిరణ డగౌట్ నుంచి నేరుగా వచ్చి బౌలింగ్ వేసేందుకు సిద్ధపడటంతో అంపైర్లు అతన్ని అనుమతించలేదు. ఆ సమయంలో పతిరణ బౌలింగ్ ప్రాధాన్యత తెలిసిన ధోని అంపైర్లతో వాదించి మరి అతనితో బౌలింగ్ చేయించాడు. ధోని నుంచి ఈ తరహా బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయని జనం ఒక్కసారిగా కంగుతిన్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Samantha : ఆ హీరోతో లిప్ లాక్…బెడ్ రూమ్ సీన్లు చేయనున్న సామ్?
The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు
Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు