ఐపీఎల్ 2022 సీజన్ లో దారుణంగా విఫలమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు అలాగే జట్టు యాజమాన్యానికి మధ్య విబేధాలు వచ్చాయి అని ప్రచారం జరుగుతుంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో చెన్నై కెప్టెన్ గా జడేజా ఉండగా… ఆ తర్వాత ఫలితాలు అనుకున్న విధంగా మారలేదు. దాంతో మధ్యలోనే మళ్ళీ ఆ బాధ్యతలను ధోనికి అప్పగించింది యాజమాన్యం.
Advertisement
అయితే జడేజాకు కెప్టెన్ గా తప్పుకోవాలని లేకున్నా… యాజమాన్యమే బలవంతంగా తప్పించింది అనే వార్తలు వచ్చాయి. దాంతో గత ఏడాది రైనాను అవణించిన విధముగానే ఈ ఏడాది జడేజాతో ప్రవర్తిస్తున్నారు అని.. వచ్చే ఐపీఎల్ లో జడేజాను జట్టు నుండి తొలగిస్తారు అనే వాదన మొదలయ్యింది. అందుకు తగ్గట్లుగానే జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసింది అని ప్రచారం ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఈ వార్తలపై చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ స్పందించారు.
Advertisement
కాశీ విశ్వనాథన్ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలను తప్పు బట్టారు. సరైన ఆధారాలు లేకుండా ఇలా ప్రచారం చేస్తున్నారు అని చెప్పారు. అదే విధంగా జడేజా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ.. అతను ఎప్పటికి మా జట్టులోని ఉంటాడు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో జడేజా ఐపీఎల్ 2023 లో కూడా చెన్నై జట్టులోని కొనసాగుతాడు అనే క్లారిటీ అయితే అభిమానులకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఆడిన 11 మ్యాచ్ లలో 4 విజయాలే సాధించిన చెన్నై నేడు ముంబైతో తలపడుతుంది. మరి ఇందులో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ 2022 లో వింత సమస్య… కరెంట్ లేక చెన్నైకి నష్టం..!
బీసీసీఐకి ఎదురు తిరుగుతున్న కస్టమర్లు…!