Home » ఈ 4 క్రెడిట్ కార్డులపై భారీ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్.. ఏంటంటే..?

ఈ 4 క్రెడిట్ కార్డులపై భారీ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్స్.. ఏంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో ఎక్కువగా బెనిఫిట్ ఉండే క్రెడిట్ కార్డ్స్ లాంచ్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా 4 క్రెడిట్ కార్డ్స్ కస్టమర్లకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తూ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మరి ఆ క్రెడిట్ కార్డ్స్ వివరాలు ఏంటో చూద్దాం.
#1. స్టాండర్డ్ చార్టర్డ్ ఈజీ మై ట్రిప్ క్రెడిట్ కార్డ్ :

ఈ క్రెడిట్ కార్డు ద్వారా హోటల్ బుకింగ్స్ పై 20%, ఫ్లైట్ బుకింగ్స్ పై 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే బస్ టికెట్ పై 125 తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఇంకా అనేక ఆఫర్లతో ఈ క్రెడిట్ కార్డు మనకు అందుబాటులో ఉంది.
#2. టాటా న్యూ ప్లస్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ :

Advertisement

ఈ కార్డు తీసుకుంటే వెల్కమ్ బెనిఫిట్ కింద 499 కొత్త కాయిన్స్ లభిస్తాయి. టాటా బ్రాండ్ ప్రొడక్ట్స్ కొంటె రెండు శాతం న్యూ కాయిన్స్ వస్తాయి. టాటా న్యూ యాప్ లో లావాదేవీలు చేస్తే ఐదు శాతం న్యూ కాయిన్స్ లభిస్తాయి. దీనికి ఏడాదిలో ఫీజు 499. ఏడాదిలో లక్ష ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు లభిస్తుంది.

Advertisement

also read:తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని పనులు.. 2 చాలా ఇంపార్టెంట్..!!

సాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు:

ఈ క్రెడిట్ కార్డు ఉంటే సాంసంగ్ ప్రోడక్ట్ పై 10% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నెల రోజుల్లో 3 లావాదేవీలు చేస్తే 2500 ఎడ్జ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. టాటా 1mg, బిగ్ బాస్కెట్, జొమాటో వంటి వాటిల్లో ఖర్చు చేస్తే ప్రతి ₹100 కి పది రివార్డు పాయింట్స్ లభిస్తాయి. యాన్యువల్ ఫీజు 500..
#4. క్యాష్ బ్యాక్ ఎస్బిఐ కార్డు :

ఈ కార్డును తీసుకున్న వారికి ఆన్లైన్ షాపింగ్ లో 5% క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఆఫ్లైన్ లావాదేవీల పై ఒక్క శాతం క్యాష్ బ్యాక్. యాన్యువల్ ఫీజ్ 900.. ఏడాదిలో రెండు లక్షలు ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు లభిస్తుంది.

also read:

Visitors Are Also Reading