టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతోందని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. ముంబైకి చెందినటువంటి ఒక వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతోందని సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఈమె వివాహానికి సంబంధించిన విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు బిజినెస్ మేన్ లనే పెళ్లి చేసుకుంటున్నారు.
Advertisement
ఇప్పటికే కాజల్, శ్రేయ,ప్రణీత, సంజన ఇంకా అనేకమంది భామలు వ్యాపారస్తులని పెళ్లాడారు. ఇకపోతే హన్సిక కూడా బిజినెస్ మాన్ తో ఏడడుగులు వేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ టైంలోనే తమన్న కూడా పెళ్లి చేసుకోబోతోందని ఈ మిల్కీ బ్యూటీ కూడా వ్యాపారవేత్తనే వివాహం చేసుకుంటుందని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. వరుడు కూడా తమన్నా తల్లిదండ్రులకు మరియు తమన్నాకు బాగా నచ్చాడు అని తెలుస్తోంది. ఇకపోతే కోలీవుడ్ మీడియాలో ఈ విషయం చాలా వైరల్ అవుతున్న సందర్భంలో తమన్న చేసుకోబోయే వ్యక్తి గురించి ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది.
Advertisement
also read:తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని పనులు.. 2 చాలా ఇంపార్టెంట్..!!
అయితే తమన్నా పెళ్లి చేసుకునే వ్యక్తికి ఓ వింత జబ్బు ఉందట.. అది ఏంటయ్యా అంటే..అతని శరీరానికి పడనటువంటి ఏదైనా ఫుడ్ తింటే వెంటనే రియాక్షన్ జరిగి శరీరం పై ర్యాషెస్ వస్తాయట. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె అభిమానులంతా రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి వింత వ్యాధి ఉన్న ఈ అబ్బాయిని తమన్నా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆయన ఆస్తి అంటూ రకరకాల కామెంట్లతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంత వరకు అబద్ధం ఉందో అసలు విషయం బయటకు వస్తే కానీ తెలియదు.
Advertisement
also read: