Home » Rashmika Mandana : ‘షారుఖ్’తో నేషనల్ క్రష్.. !

Rashmika Mandana : ‘షారుఖ్’తో నేషనల్ క్రష్.. !

by Bunty
Ad

Rashmika Mandana : నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో “ఛలో” సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమా అనంతరం వరుసగా ‘గీత గోవిందం’, ‘పుష్ప’ వంటి సినిమాలలో నటించి తిరుగులేని విజయాన్ని అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలివుడ్ లో కూడా నటించింది ఈ అమ్మడు. హిందీలో ‘గుడ్ బై’, ‘మిషన్ మజ్ను’ వంటి సినిమాలలో నటించింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ క్రేజీ ఆఫర్స్ ను తెచ్చి పెడుతున్నాయి. ఇక రష్మిక తెలుగులో ప్రస్తుతం ‘రెయిన్ బో’, ‘ఖుషి’ వంటి సినిమాలలో నటిస్తోంది.

Advertisement

Advertisement

ఇక బాలీవుడ్ లో యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే డిసెంబర్ విడుదల కానుంది. కెరీర్లో దూసుకుపోతున్న రష్మిక బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో జోడి కట్టనుంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా కథ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కనుక క్లిక్ అయితే రష్మికకు బాలివుడ్ లో తిరుగు ఉండదు. ఈ సినిమాతో పాటు యంగ్ హీరో విక్కీ కౌశల్ తో ఓ సినిమాలో నటించడానికి రష్మిక రెడీ అవుతోందట.

ఇక రష్మిక ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ తాను విజయ్ తో రిలేషన్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. కానీ వీరిద్దరూ కనుక వివాహం చేసుకుంటే రష్మిక జాతకం దరిద్రంగా మారుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి వెల్లడించడం జరిగింది. వేణు స్వామి చెప్పిన విషయాన్ని నమ్మి రష్మిక తన మొదటి వివాహాన్ని కూడా రద్దు చేసుకుందట. ఇక ఇప్పుడు విజయ్ విషయంలో మాత్రం వేణు స్వామి చెప్పిన విషయాన్ని రష్మిక నమ్మడం లేదట. ఇక రష్మిక, విజయ్ నిజంగా వివాహం చేసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Visitors Are Also Reading