రెండేండ్ల పాటు ప్రపంచాన్ని గజగజ వణికించింది ఈ వైరస్. గతంలో ఎప్పుడూ లేని విధంగా మృత్యుంఘటికలు మ్రోగించిన కరోనా కథ ముగిసిందా..? ఈ వైరస్ అప్పుడే అంతం కాలేదని స్పష్టం చేసింది లాన్సెట్మెడికల్ జర్నల్. కరోనా కాస్త తగ్గింది కదా అని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు అని హెచ్చరించింది. కరోనా శాశ్వతంగా ఇకపై మనతో ఉండనున్నదా..? ఈ ప్రపంచం స్వేఛ్చగా ఊపిరి పీల్చుకునే వార్తను లాన్సెట్ మెడికల్ జర్నల్ వెల్లడించింది. వైరస్ ఎప్పటికీ మనతోనే ఉంటుందని, సీజనల్ ప్లూ లాగా కొనసాగుతుందని స్పస్టం చేసింది. ఎక్కువ మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కునే శక్తి ఏర్పడినట్టు లాన్సెట్ అంచనా వేసింది.
Also Read : Fruit Market : ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్.. ఎక్కడో తెలుసా..?
Advertisement
Advertisement
కరోనా అంటూ వ్యాధి కాబట్టి అది దాని శక్తిని కోల్పోయినా సీజనల్ వ్యాధుల రూపంలో మనతోనే ఉంటుందని పేర్కొంది. రుతువులు మారే తరుణంలో వచ్చే సాధారణ జలుబు, జ్వరం మాదిరిగానే కొవిడ్ కొనసాగుతుందని వెల్లడించింది. సాధారణ వ్యాధిలా ఉంటుంది కాబట్టి దాని వల్ల తీవ్ర అనారోగ్యం ఉండకపోవచ్చు అని లాన్సెట్ తెలిపింది. ఇలా చెబుతూనే కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందేనని.. ప్రతీ ఒక్కరూ మాస్క్లు తప్పనిసరిగా ధరించాల్సిందే అని సూచించింది.
ముఖ్యంగా లాన్సెట్ చెప్పిన విధంగా వైరస్ బలహీన పడి సాధారణ ప్లూగా మారుతుందా..? లేక మరికొన్ని బలమైన వేరియంట్లు పుట్టుకొచ్చి కోవిడ్ తీవ్రత ఇంకా పెరుగుతుందా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి. గతంలో కొంత మంది వైద్య నిపుణులు థర్డ్ వేవ్ ఉండకపోవచ్చు అని చెప్పిన సందర్భాలు చూశాం. కానీ థర్డ్ వేవ్ పంజా విసిరింది. మరొక దశలో వైరస్ ప్రపంచాన్ని ముప్పు తిప్పలు కూడా పెడుతుందేమోనన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Also Read : బిల్ గేట్స్ కు ‘హిలాల్ ఎ పాకిస్తాన్’ అవార్డుతో సత్కారం