కరోనా విజృంభణ కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రారంభమైనట్టుగానే కనిపిస్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు కరోనా పాజిటివ్ సోకింది. కరోనా లక్షణాలుండడంతో వైద్య పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాను కరోనా బారిన పడ్డట్టు నటుడు బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. అదేవిధంగా గత రెండు రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు బాలకృష్ణ.
Advertisement
హైదరాబాద్‌లోనే ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు. తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని ప్రకటించారు. ఇటీవల యోగా డే సందర్భంగా ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్నటువంటి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహించిన యోగా వేడుకలకు బాలకృష్ణ హాజరయ్యారు. కొన్ని ఆసనాలు కూడా వేశారు. మరొక వైపు తమ అభిమానులు బాలకృష్ణకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలియగానే ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పలువురు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. బాలకృష్ణ ఆహా ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్స్ ప్రోగ్రామ్ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో బాలకృష్ణకు కరోనా పాజిటివ్ రావడంతో షో కొనసాగుతుందా..? లేక ఏమైనా గ్యాప్ వస్తుందా అనే సందేహాలు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
కరోనా తెలంగాణలో కాస్త ఎక్కువవుతుందనే చెప్పాలి. రోజుకు 500 కేసుల వరకు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాస్త తక్కువగానే నమోదు కావడం విశేషం. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పవర్ పుల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. శృతిహాసన్ కథనాయికగా నటిస్తోంది. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అన్‌స్టాపబుల్ సీజన్ -2 త్వరలోనే ప్రారంభమవ్వనుంది. ఇటీవల విడుదలైన బాలయ్య అఖండ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.
Also Read :
హీరో రాజశేఖర్ సినిమాలో బాలనటిగా కనిపించి తిరిగి ఆయనతోనే హీరోయిన్ గా కనిపించిన నటి ఎవరంటే..?