Home » భారత్ – సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కరోనా కలకలం..!

భారత్ – సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కరోనా కలకలం..!

by Azhar
Ad
కరోనా కారణంగా గత రెండు ఏళ్లుగా భారత జట్టు బాబో బబుల్ లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా ఆటగాళ్లకు యతిని అనేది బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది తాజాగా ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ కూడా బయో బబుల్ మధ్యలోనే సాగింది. ఇక ఇది ముగిసిన తర్వాత ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే… ఈ సిరీస్ ను ఎలాంటి కరోనా నియమాలు.. బాబో బబుల్ మధ్యలో కాకుండా ఫ్రీ గా జరపనున్నట్లు తెలిపింది.
అయితే ఈ రోజు రెండు జట్ల మధ్య మొదటి టీ 20 మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతుంది. కానీ ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కి షాక్ ఇచ్చే విషయం బయటికి వచ్చింది. అయితే బీసీసీఐ ఎటువంటి కరోనా నియమాలు లేకున్నా ఆటగాళ్లకు కరోనా పరీక్షలు మాత్రం తప్పనిసరి అని తెలిపింది. ఈ క్రమంలో నెడ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు చేసిన కరోనా పరీక్షలలో సౌత్ ఆఫ్రికా ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలిసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్కరమ్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
అయితే ఈ సిరీస్ కంటే ముందు ఐపీఎల్ 2022 లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మార్కరమ్‌.. ఐపీఎల్ లో తన జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్ళకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్ళాడు. అక్కడి నుండి మళ్ళీ తన జట్టుతో కలిసి ఈ నెల 2న ఇండియాకు వచ్చాడు. ఇక్కడకు వచ్చిన తర్వాత నుండి సఫారీ ఆటగాళ్లకు అందరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా తాజాగా మార్కరమ్‌ కు మాత్రమే పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ టెంబా బావుమా టాస్ కోసం వచ్చినప్పుడు వెల్లడించాడు.

Advertisement

Visitors Are Also Reading