సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి తెలియని వారుండరు. కేవలం సినిమాలు మాత్రమే కాదు రాజకీయాల్లో రాణిస్తున్నారు పవన్ కల్యాణ్. మామూలుగా పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ దాని వెనుక కర్త, కర్మ, క్రియ అన్ని త్రివిక్రమ్ అనే ఇండస్ట్రీ వర్గాలన్నింటికీ తెలుసు. పవన్ రీ ఎంట్రీ, వకీల్ సాబ్ సెలెక్షన్ వీటన్నింటి వెనుక ఉంది త్రివిక్రమ్. దాని తరువాత భీమ్లానాయక్ సినిమాకు కూడా అన్ని ఆయనే వ్యవహరించారు. ఆయనతో సంబంధం లేని హరి హర వీరమల్లు సినిమా పక్కన పడింది.
ఈ లోగా త్రివిక్రమ్ డీల్ చేసి స్క్రిప్ట్ అందిస్తున్న వినోతహితం రీమేక్ మాత్రం పట్టాలు ఎక్కేస్తుంది. అదేవిధంగా త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తున్న మరొక సినిమా కూడా డీల్ అయి సిద్ధంగా ఉంది. వైష్ణవ్ తేజ్ హీరో ఇలా పవన్ విషయంలో అన్ని తన కంట్రోల్లో ఉంచుకున్న త్రివిక్రమ్ లేటెస్ట్ గా తన టీమ్ ద్వారా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. వినోదహితం రీమేక్ విషయంలో యూనిట్ కానీ, ఆ సినిమాతో ఏవిధంగా సంబంధం కలిగిన మరెవ్వరూ కానీ ఎక్కడ నోరు మెదపడానికి వీలు లేదని తన వ్యక్తి గత సిబ్బందితో మౌఖిక ఆదేశాలు జారీ చేయించినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement
ఎవ్వరు ఆ సినిమా గురించి అడిగినా అస్సలు నోరు మెదపవద్దని త్రివిక్రమ్ వైపు నుండి ఆదేశాలు జారీ చేసారు. ఇటీవలే లాంఛనంగా ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అయితే పూజకు ఇద్దరు హీరోలు రాలేదు. రెండు నెలల దాకా మంచి ముహుర్తాలు లేవని లాంఛనంగా ప్రారంభించారు. మొత్తానికి పవన్ సినిమాల మీద త్రివిక్రమ్ పూర్తి కంట్రోల్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. క్వాలిటీ కంట్రోల్, మీటింగ్లు, డిస్కషన్లు, యాక్టర్ సెలక్షన్లు అన్ని ఆయన కనుసన్ననలోనే జరుగుతున్నాయి.
Also Read :
నల్లదారం కట్టుకుంటే ఈ రెండు రాశుల వారికి అస్సలు కలిసి రాదట..!
కుక్క కోసం విమాన టిక్కెట్లు డిమాండ్ చేసిన రష్మిక..!