Home » న‌ల్ల‌దారం క‌ట్టుకుంటే ఈ రెండు రాశుల వారికి అస్స‌లు క‌లిసి రాద‌ట‌..!

న‌ల్ల‌దారం క‌ట్టుకుంటే ఈ రెండు రాశుల వారికి అస్స‌లు క‌లిసి రాద‌ట‌..!

by Anji
Ad

చాలా మంది త‌మ‌కు దిష్టి త‌గ‌ల‌కుండా కాలుకు న‌ల్లదార‌మును క‌ట్టుకుంటారు. మ‌రికొంద‌రు తెల్ల‌ని కాలుకు న‌ల్ల‌ని దారం క‌ట్టుకుంటే చాలా అందంగా ఉంటుంద‌ని కూడా క‌డ‌తారు. కొంద‌రూ ఎందుకు క‌ట్టుకుంటారో తెలియ‌కుండానే క‌ట్టుకుంటారు. కొంత‌మంది పుట్ట‌గానే పిల్ల‌ల‌ చేతుల‌కు, కాళ్ల‌కు న‌ల్ల‌దారాన్ని క‌డుతారు. మ‌రికొంత మందికి కాళ్ల‌లో నొప్పి రాకుండా ఉండ‌టానికి కాలుకు న‌ల్ల‌దారం క‌ట్టుకుంటారు. కేవ‌లం కాళ్లే కాదు చేతులు, న‌డుము, మెడ‌కి ఇలా ప‌లు కొంద‌రూ న‌ల్ల‌దారాన్ని క‌ట్టించుకుంటారు. న‌ల్ల‌దారాన్ని ఎవ‌రు క‌ట్టుకోవ‌చ్చు.. ఎవ‌రు క‌ట్టుకోకూడ‌దో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

జ్యోతిష్య‌శాస్త్రం ప్ర‌కారం.. కంటి చూపుకి శ‌క్తి ఎంతో శ‌క్తి ఉంటుంది. కొంత మందికి ఎదుటివారిపై వారి కంటిచూపు ప‌డితే వారికి చెడు జ‌రుగుతుంది. కంటి చూపుకి అంత‌శ‌క్తి ఉంటుంది. ప్ర‌ధానంగా ఎక్కువ‌గా చిన్న పిల్ల‌ల‌కు దిష్టి త‌గులుతుంది. చిన్న‌పిల్ల‌లు చాలా సున్నితంగా, అందంగా ఉంటారు. వారిపై చెడు దృష్టి ప‌డ‌కుండా కాళ్ల‌కు, చేతుల‌కు న‌ల్ల‌దారాన్ని క‌డుతారు. ఇలా క‌ట్ట‌డం ద్వారా చెడు దృష్టి వారిపై ప‌డ‌దు అని కొంద‌రి న‌మ్మ‌కం. న‌లుపు చెడు శ‌క్తిని లాగేస్తుంది. అదేవిధంగా శ‌ని దేవుడిని పూజించేట‌ప్పుడు కాలికి న‌ల్ల‌దారాన్ని క‌ట్టుకుంటారు. దీంతో రాహు, కేతు దోషాలు ద‌గ్గ‌రికి రావని కొంద‌రూ పేర్కొంటున్నారు.

 

Advertisement

కొంత మంది జీవితంలో ఆర్థిక స‌మ‌స్య‌లుంటాయి. అలాంటి వారు మంగ‌ళ‌వారం రోజు న‌ల్ల‌దారాన్ని క‌ట్టుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లు తొలిగిపోయి ఇంట్లో డ‌బ్బు కొర‌త ఉండ‌దు అని నిపుణులు పేర్కొంటున్నారు. న‌ల్ల‌దారాన్ని క‌ట్టుకునే ముందు దానికి తొమ్మిది ముడులు వేసి క‌ట్టుకోవాలంట‌. ఈ దారాన్ని క‌ట్ట‌డం వ‌ల్ల పిల్ల‌లు ఎలాంటి అసౌక‌ర్యానికి గుర‌వ్వ‌రు. పెద్ద‌వాళ్లు కూడా న‌ల్ల‌దారాన్ని క‌ట్టుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. నల్ల దారాన్ని క‌ట్టుకున్నాక గాయ‌త్రీ మంత్రాన్ని జ‌పిస్తే ఆ దారం మ‌రింత శ‌క్తి వంతంగా త‌యార‌వుతుంద‌ని జ్యోతిష్య‌శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

కొన్ని రాశుల వారు ఈ న‌ల్ల‌దారాన్ని క‌ట్టుకోకూడ‌దు అని వాస్తు శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా మేష‌రాశి, వృశ్చిక రాశిలో పుట్టిన వారికి న‌లుపు రంగు అస్స‌లు క‌లిసి రాదు. క‌నుక వీరు న‌ల్లదారాన్ని అస్స‌లు క‌ట్టుకోకూడ‌ద‌ట‌. న‌ల్ల‌దారాన్ని వారు క‌ట్టుకుంటే వారి జీవితాలు ప్ర‌మాదంలో ప‌డే అవ‌కాశం ఉంద‌ట‌. అదేవిధంగా ఈ న‌ల్ల‌దారాన్ని ధ‌న‌స్సు, తుల రాశి వారు క‌ట్టుకుంటే వారికి చాలా మంది జ‌రుగుతుంద‌ట‌. జీవితంలో ఎటువంటి స‌మ‌స్య‌లు రావు. ఈ రాశిల వారు ఎలాంటి సందేహం లేకుండా న‌ల్ల‌దారాన్ని చేతికి, లేదా కాలికి క‌ట్టుకోవ‌చ్చు.

Also Read : 

సింగ‌ర్ చిన్మ‌యి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స‌స్పెండ్‌.. ఎందుకంటే..?

నరేష్ తో నాలుగవ పెళ్లిపై వార్త‌లు వస్తున్న సమయంలో ..! పవిత్ర లోకేష్ మొదటి భర్త గురించి అలా చెప్పారా ?

Visitors Are Also Reading