నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా థియేటర్లతో పాటూ ఓటీటీలోనూ మంచి విజయం సాధించింది.
Advertisement
అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన బాలయ్య మొదటి సినిమా మాత్రం బ్యాన్ అయ్యిందన్న సంగతి చాలా మందికి తెలియదు. బాలకృష్ణ మొట్టమొదటిసారి తెరపై కనిపించిన సినిమా తాతమ్మకల. ఈ సినిమాకు ఎన్టీరామారావు దర్శకత్వం వహించారు. 1974 ఆగస్టు 30వ తేదీన ఈసినిమా విడదలైంది.
ALSO READ : ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు బాలయ్యకు చిరు ఆహ్వానం..!
కానీ ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. బాలయ్య మాత్రం ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నారు. దాంతో ఆయన నటనుకు మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమాను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 రోజుల పాటూ బ్యాన్ చేసింది. దానికి కారణం అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టింది. కానీ ఈ సినిమాలో కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా చూపించారు.
Advertisement
అంతే కాకుండా నాలుగు తరాల మధ్య జరిగే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సినిమాలో కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా చూపించడంతో పాటూ భూసంస్కరణలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. దాంతో సినిమాను ప్రభుత్వం 60 రోజులు బ్యాన్ చేయాల్సి వచ్చింది. వాటిపై దర్శకుడు ఎన్టీఆర్ వివరణ ఇచ్చినా ప్రభుత్వం మాత్రం వినలేదు.
ఇక చేసేది లేక ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి మళ్లీ విడుదల చేశారు. అయినప్పటికీ ఈ సినిమా పెద్ద విజయం సాధించలేదు. మొదటిసారి ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ లో విడుదల చేయగా రెండో సారి సినిమాను కలర్ లో విడుదల చేశారు. ఇక ఈ సినిమాలోని పాత్రకు బాలయ్య అయితేనే సూట్ అవుతారని ఎన్టీఆర్ ఆయనను తీసుకున్నారట.