Home » నాటు నాటు పాటకు ప్రముఖ హాస్యనటుల డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

నాటు నాటు పాటకు ప్రముఖ హాస్యనటుల డ్యాన్స్.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..!

by Anji
Ad

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ సంపాదించుకుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాతో పాటు అందులోని పాటలు కూడా ప్రేక్షకులను తెగ మెప్పించాయి. ప్రధానంగా సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే విపరీతమైన ప్రజాదారణ పొందింది. ఇక ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

Advertisement

ఆస్కార్ తరువాత గోల్డెన్ గ్లోబ్ అవార్డు ని ఇటీవలే నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ విభాగంలో  సొంతం చేసుకోవడం విశేషం.  దీంతో నాటు నాటు పాట మరింత పాపులర్ అయింది. అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర యూనిట్ కి ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు తెలుపుతున్నారు. 

ఈ పాటకు ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని రకరకాల పోస్ట్ లు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ లు చాలా ఆసక్తిని కలిగించేవిధంగా ఉంటాయి. నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో అవార్డుతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ పేజీలో ఓ పోస్టు చేశారు. అందులో ముఖ్యంగా పాతకాలం నాటి సినిమా క్లిప్ ని షేర్ చేశారు. 

Advertisement

ఈ పాటలో ఇద్దరూ హాస్యనటులు లారెల్, హార్డీ అచ్చం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మాదిరిగానే మంచి రిథమ్ కలుపుతూ డ్యాన్స్ చేశారు. “నాటు నాటు పాటను చూస్తే ఎవ్వరూ ఆగలేరు” అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. నెటిజన్లయితే ఈ వీడియో క్లిప్ ని ఎంతో మెచ్చుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రా అకౌంట్ ని ఫాలో అవ్వడానికి ఇలాంటి ట్వీట్స్ చాలు అంటూ మరికొందరూ కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. “లారెల్, హార్డీ ఆర్ఆర్ఆర్ డ్యుయో మాదిరిగా ఎనర్జీ చూపించలేకపోవచ్చు. అలా అని వారు ఏమీ చెత్తగా డ్యాన్స్ చేయలేదు” అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. 

Also Read :  జబర్దస్త్ హైపర్ ఆదికి MLA టికెట్.. ఏ పార్టీ నుంచి అంటే..?

 

Visitors Are Also Reading