Home » Suhas: నేను బ్రతుకొద్దా… అందుకే రెమ్యూనరేషన్ పెంచాను..!

Suhas: నేను బ్రతుకొద్దా… అందుకే రెమ్యూనరేషన్ పెంచాను..!

by Sravya
Ad

నటుడు సుహాస్ గురించి ప్రత్యేకించి పరిచయం చెయ్యక్కర్లేదు. డిఫరెంట్ గా ఉండే కథలని ఎంపిక చేసుకుంటూ సుహాస్ హిట్ల ని కొడుతూ ఉంటారు. చిన్న సినిమా తో వచ్చి సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటూ ఉంటారు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్ళలో సుహాస్ కూడా ఒకరు తన టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చే మంచి పేరు తెచ్చుకున్నాడు వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బానే సంపాదించుకుంటున్నారు. కెరియర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న పాత్రలని చేసి తర్వాత హీరోగా మారిపోయారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా విలన్ గా కూడా నటించి అందరిని మెప్పించారు. హీరోగా అవకాశాలని అందుకుంటున్నటువంటి సుహాస్ మంచి సక్సెస్ఫుల్ హీరోగా అడుగులు వేస్తున్నారు.

Advertisement

Advertisement

హీరోగా వచ్చిన అవకాశాలు అన్నిటిని కూడా ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరోగా పేరు ప్రఖ్యాతలని సంపాదించుకుంటున్నాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో పెద్ద హిట్ని కొట్టాడు. ఇప్పుడు ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకులు ముందుకి రావడానికి రెడీ అయిపోయాడు. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల అయింది ఈ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

suhas remunaration

suhas remunaration

రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. రెమ్యూనరేషన్ పెంచారని వార్తలు వస్తున్నాయి నిజం ఏంటి అని అడిగితే ప్రతి రోజు వంద రూపాయలు తీసుకొని ఈ పని చేస్తూ ఎంతో కష్టపడి ఎదుగుతూ ఇక్కడికి వచ్చాను నేను కూడా బతకాలి కదా అని అన్నాడు. సుహాస్ ఒక్కో సినిమాకి సుమారు కోటి రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. సుహాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అయితే నటిస్తున్న సినిమాలన్నీ సక్సెస్ అవుతున్నాయి. దీంతో రెమ్యునరేషన్ పెంచాలని వార్తలు వస్తున్నాయి అని అడిగిన దానికి సుహాస్ ఇలా ఆన్సర్ ఇచ్చారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading