Home » ఆ తర్వాత కేవలం ఆ పాత్రలు మాత్రమే వచ్చాయి… దానికి నేను చేసింది అదే… కలర్స్ స్వాతి..!

ఆ తర్వాత కేవలం ఆ పాత్రలు మాత్రమే వచ్చాయి… దానికి నేను చేసింది అదే… కలర్స్ స్వాతి..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు కలర్స్ అనే ఒక టీవీ షోకు యాంకర్ గా వ్యవహరించింది. ఆ షో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకోవడం దాని ద్వారా ఈ నటి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈమె పేరుకు కలర్స్ అనేది జోడి అయింది.

Advertisement

దానితో స్వాతి అన్న ఎవరు గుర్తుపడతారో లేదో తెలియదు కానీ… కలర్స్ స్వాతి అంటే మాత్రం చాలా వరకు గుర్తుపడతారు. ఈనటి కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందినటువంటి డేంజర్ మూవీతో వెండితెరకు పరిచయం అయింది. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతికి ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన స్వాతి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మన అందరికీ తెలిసిందే.

Advertisement

ఇలా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న స్వాతి మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందులో భాగంగా ప్రస్తుతం వరుస సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా స్వాతి ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన సినీ జీవితానికి సంబంధించి తాను ఎదుర్కొన్న ఎత్తుపల్లాల గురించి చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో భాగంగా కలర్స్ స్వాతి మాట్లాడుతూ… నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను అని, నేను డేంజర్ మూవీతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ సినిమా సమయంలో నాపై అనేక రూమర్స్ వచ్చాయి.

 

కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్గా రూపొందిన ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే సినిమాలో నేను వెంకటేష్ గారికి మరదలు పాత్రలో నటించాను. దానితో ఆ తర్వాత నాకు మరదలు పాత్రల అవకాశాలే వరుసగా వచ్చాయి. కానీ నేను మాత్రం ఆ పాత్రలో నటించలేదు. దానికి ప్రధాన కారణం అలా నటిస్తే కేవలం ఆ పాత్రలకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. అలాగే వాటితో నా కెరియర్ గ్రాఫ్ పడిపోతుంది అనే ఉద్దేశంతో ఆ పాత్రలను రిజెక్ట్ చేశాను అని స్వాతి చెప్పుకొచ్చింది.

Visitors Are Also Reading