ఏపీలో క్యాబినెట్ విస్తరణ పై గత కొంత కాలంగా చర్చ సాగుతోంది. దీనికి ప్రధాన కారణం రెండున్నరేళ్ల తరువాత క్యాబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని సీఎం జగన్ చెప్పడమే. ఇప్పటికే ఆ సమయంలో దాటడంతో ఇదో విస్తరణ. విస్తరణ అప్పుడే అంటూ కథనాలు వస్తున్నాయ. అయితే వైసీపీఎల్పీ సమావేశంలో దానిపై క్లారిటీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రి వర్గాన్ని పూర్తి పునర్ వ్యవస్థీకరిస్తానని చెప్పాను అని గుర్తు చేసుకున్న ఆయన దీంట్లో భాగంగా కూడా చేపడుతామన్నారు.
Advertisement
Advertisement
ముఖ్యంగా పార్టీ అనేది మీరు, నేను అందరం కలిసి నిలబెట్టుకున్న పార్టీ అని గుర్తు ఉంచుకోవాలని సూచించిన సీఎం మంత్రి వర్గంలో నుంచి పక్కన పెడుతున్నట్టు కాదు. వారికి పార్టీ బాధ్యతలు జిల్లా అధ్యక్ష పదవులు రీజనల్ కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగిస్తున్నామని వెల్లడించారు. మంత్రులుగా పని చేసినందున వారికి ప్రతిష్ట పెరుగుతుంది. పార్టీని నడిపించే శక్తి ఉంటుందన్నారు సీఎం జగన్. మీరు గెలవండి, పార్టీని గెలిపించుకుని రండి. తలా ఒక చేయి వేస్తేనే మనం గెలువగలుగుతాం, అధికారంలోకి రాగలుగుతామన్న ఏపీ సీఎం ఎవరినైనా మంత్రి పదవుల నుంచి తప్పిస్తున్నానంటే.. వారికి మరింత బాధ్యత అప్పగిస్తున్నట్టు అని స్పష్టం చేశారు.
26 కొత్త జిల్లాలకు అధ్యక్షులను తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. డోర్ టూ డోర్ సర్వే చేస్తే సర్వేలో మీ పేరు రాకపోతే మొహమాటం లేకుండా మీకు టిక్కెట్లు కూడా నిరాకరిస్తానని హెచ్చరించారు సీఎం. ఏ ప్రభుత్వం చేయనన్ని పనులు చేశామని తెలిపారు. చిరునవ్వుతో ఆనందంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతామన్నారు. ఇంత మంది ప్రజల జీవితాలను మార్చగలిగామనే తృప్తి మనకు ఉందని, భవిష్యత్ తరాలు మన గురించి కచ్చితంగా చెప్పుకునే విధంగా పని చేశామన్నారు.
Also Read : IPL 2022 : ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు..!