తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2001 సంవత్సరంలో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్… 2014లో రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్ర గాంధీగా మారిపోయారు. ఇక 2014 నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు పది సంవత్సరాలపాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేస్తున్నారు.
అంతటి విజయాన్ని సాధించిన సీఎం కేసీఆర్ కు జీవితంలో ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఓటమి ఎదురయింది. అది కాంగ్రెస్ పార్టీ నేత అయిన అనంతుల మదన్ మోహన్ చేతిలో సీఎం కేసీఆర్ ఓడిపోయారు. అసలు వివరాల్లోకి వెళితే… 1983 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున సిద్దిపేట నియోజకవర్గంలో సెట్టింగ్ ఎమ్మెల్యే అయిన అనంతుల మదన్ మోహన్ బరిలో దిగారు. అప్పటికే ఆయన మూడుసార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు.
Advertisement
Advertisement
ఇటు తెలుగుదేశం పార్టీ తరఫున కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. బిజెపి పార్టీ తరఫున నరసింహారెడ్డి పోటీ చేశారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలలో మదన్ మోహన్ చేతిలో కెసిఆర్ ఓడిపోయారు. ఎన్నికలలో మదన్ మోహన్ కు 28, 766 ఓట్లు వచ్చాయి. టిడిపి తరఫున పోటీ చేసిన కేసీఆర్ కు 27, 899 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 887 ఓట్ల తేడాతో సీఎం కేసీఆర్ ఓడిపోయారు. అయితే కెసిఆర్ కు 1983లో జరిగిన ఎన్నికలే మొదటివి కావడం విశేషం. మొదటి ఎన్నికల్లోనే ఓటమి చవిచూసిన సీఎం కేసీఆర్… ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. ఇప్పటివరకు 13 సార్లు విజయం సాధించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడా కూడా ఓడిపోలేదు సీఎం కేసీఆర్.
ఇవి కూడా చదవండి
- జగన్ కు భయపడి…ఢిల్లీలో లోకేష్ దాక్కున్నాడు – రోజా ఫైర్
- Virat Kohli : ఆసీస్ ప్లేయర్లను ర్యాగింగ్ చేసిన కోహ్లీ !
- జగన్ సర్కార్ సంచలనం…బ్రాహ్మణి, భువనేశ్వరి, బాలకృష్ణపైనా కేసులు ?