ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ స్థలంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి నిర్మాణానికి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేశారు. మంత్రులు హరీశ్‌రావు,వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ హాజరయ్యారు. దాదాపు 22 ఎకరాల్లో ఈ హాస్పిటల్‌ను నిర్మించనున్నారు.
Advertisement
ముఖ్యంగా నిర్మించే ఆసుప్రతిలో 300 ఐసీయూ బెడ్స్, 16 ఆపరేషన్ థియేటర్లు ఉండేవిధంగా నిర్మించనున్నారు. ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం రూ.900 కోట్లు కేటాయించింది. భారతదేశానికే తలమానికంగా ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ మాదిరిగా హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.
Advertisement
హైదరాబాద్ నగరంలో మూడు టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.2,679 కోట్లు కేటాయించింది. అల్వాల్ (బొల్లారం), సనత్‌నగర్ (ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్), ఎల్బీనగర్ (గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్) ఆవరణలో టిమ్స్ ఆసుపత్రులను నిర్మించనున్నారు. ముఖ్యంగా సనత్‌నగర్, ఎల్బనగర్ లో జీ+14 విధానంలో ఆసుపత్రి భవనాలను నిర్మిస్తారు. ఇక అల్వాల్ కంటోన్మెంట్ ఏరియా కావడంతో పక్కనే రాష్ట్రపతి నిలయం ఉండడంతో జీ+5 విధానంలో నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో టిమ్స్ ఆసుపత్రిలో వెయ్యి పడకలు అందుబాటులో ఉంచనున్నారు. కరోనా లాంటి మహమ్మారి సోకినా తట్టుకునేవిధంగా స్పెషల్ వార్డులను నిర్మించనున్నట్టు సమాచారం.
Also Read :
ఆస్ట్రేలియా అమ్మాయి..బీహార్ అబ్బాయి….ప్రేమ పెళ్ళిలో ఎన్ని ట్విస్టులో….!
ఆచార్య “సిద్ద” రోల్ కోసం ఫస్ట్ ఆప్షన్ మహేష్ బాబు….కానీ ఎవరివల్ల తప్పుకున్నాడో తెలుసా…!