ఏపీలో కొత్త మంత్రి వర్గం ఉత్కంఠకు ఇవాళ తెరపడింది. పాత మంత్రులు పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యానారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనతి, నారాయణస్వామి, అంజద్ బాషా, ఆదిమూలపు సురేష్ ను మరొక సారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.
నూతనంగా 14 మందికి అవకాశం కల్పించారు. ధర్మాన ప్రసాదరావు, రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడుదల రజని, కాకాణి గోవర్థనరెడ్డి, ఆర్.కే.రోజా, ఉషా శ్రీచరణ్ మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సం చేశారు. అయితే గతంలో మాదిరిగానే ఐదుగురు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేందుకు జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement
సీఎం జగన్‌ను ఎంతో అభిమానించే రోజా తొలిసారిగా మంత్రి అయ్యారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రోజా సీఎం జగన్ వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించారు. జగన్ ఆశీర్వాదం ఇచ్చారు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. డిగ్రీ ఆపేసి రాజకీయాల్లోకి వచ్చిన రోజా 2004, 2009లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరి 2014, 2019లో గెలిచారు. ముఖ్యంగా చిత్తూరు రాజకీయాలు పెద్దిరెడ్డి వర్సెస్ రోజాగా నడుస్తుంటాయి. రోజాకు కేబినెట్ బెర్త్ దక్కకుండా పెద్దిరెడ్డి యత్నించారని వార్తలు కూడా వినిపించాయి. తొలి కేబినెట్‌లోనే రోజాకు మంత్రి పదవీ దక్కాల్సింది. కానీ టీడీపీని ఓడించడంలో కృషి చేసిన పెద్దిరెడ్డిని నారాయణస్వామిని మంత్రులుగా తీసుకున్నారు. అప్పటి నుంచి రోజా అసంతృప్తిగా ఉన్నారు. ఈ సారి మాత్రం రోజా కోసం జగన్ డేర్ స్టెప్ తీసుకుని మంత్రి పదవీ ఇచ్చారు.
Also Read : నిజాం రాజుకు చుక్కలు చూపించిన గోండు వీరుడు….కోమురంభీం రియల్ స్టోరీ….!