సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21, 1972 లో కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు. వైయస్సార్ మరణం తర్వాత వైసిపి పార్టీ పెట్టి, ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. ఏపీలో అధికారంలోకి రావడం కోసం అనేక కష్టాలు పడ్డారు సిఎం జగన్.
Advertisement
ఇక ఇది ఇలా ఉండగా, సీఎం జగన్ ఫిట్నెస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎప్పుడు చాలా దృఢంగా కనిపిస్తారు. మానసికంగానూ, శారీరకంగానూ చాలా స్ట్రాంగ్. ఇంతకీ సీఎం జగన్ ఫుడ్ మెనూ ఏంటి? ఆయన డైలీ ఎలాంటి డైట్ ఫాలో అవుతారు అనే విషయాలపై చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ విషయాలు తాజాగా రివిల్ చేశారు టూరిజం మంత్రి రోజా. జగన్ గారిలా తింటే, జీరో సైజ్ పక్కా అని చెప్పారు. ఒక పుల్కా, కొన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ తింటారని ఆమె చెప్పుకొచ్చారు.
Advertisement
నాన్ వెజ్ వారానికి ఒకసారి మాత్రమే తీసుకుంటారని వెల్లడించారు. ఆయనకి ఇష్టమైన వంటకం కీమా అని, అది కూడా కొంచమే తింటానని విమర్శించారు. పాదయాత్ర సమయంలో నగరిలో స్టే చేసినప్పుడు, ఆయన మెనూ తనకి తెలిసిందని చెప్పుకొచ్చారు. ఇక సీఎం జగన్ ఎనర్జీ డ్రింక్ ఏంటో కూడా మంత్రి రోజా రివిల్ చేశారు. ఓ లీటర్ మిల్క్ లో, పచ్చి అల్లం వేసి బాగా మరిగిస్తే ఓ గ్లాసు పాలు మాత్రమే అవుతాయని, ఆ పాలు డైలీ ఆయన తాగుతారని చెప్పుకొచ్చారు. అది హెల్త్ కి చాలా మంచిదని రోజా చెప్పుకోచ్చారు. ఇకపై ఈ చిట్కా అందరికీ తెలుస్తుందని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి : కొత్త సంవత్సరంలో కల్యాణ్ దేవ్ సంచలన పోస్ట్.. ఆ తప్పులు అంటూ !