తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కర్ణాటకలోని తుమకూరులో చోటుచేసుకుంది. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాగేపల్లిలోని కాశపురాకు చెందిన 14 ఏళ్ల వయసు గల బాలిక చిక్కబల్లాపూర్‌లోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటుంది. ఇటీవల ఆ బాలిక తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లివచ్చింది. ఇంటి దగ్గరే ఉన్న ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆమె తల్లిదండ్రులు గ్రామంలో ఉన్న సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సాధారణ కడుపు నొప్పి అని అనుకున్న వైద్యులు ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి పంపించారు.
Advertisement
Advertisement
వైద్యులు వైద్యం చేసిన ఆ బాలికకు కడుపు నొప్పి తగ్గకపోవడంతో మరోసారి ఆసుపత్రికి తీసుకొని తల్లిదండ్రులు వెళ్లారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించగా ఊహించని విషయం తల్లిదండ్రలను చీకట్లోకి నెట్టింది. తమ కూతురు స్కూళ్లో చదువుకుంటుందని అనుకున్న తల్లిదండ్రులకు షాకింగ్ విషయం తెలిసింది. తమ కూతురు గర్భంతో ఉందని వైద్యులు చెప్పేసరికి తల్లిదండ్రులు కుప్పకూలారు. పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆమె ఓ బాలుడికి జన్మనిచ్చింది. తల్లీ, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు వైద్యులు. మైనర్ బాలిక గర్భం దాల్చడంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు అక్కడి పోలీసులు. దీనిపై విచారణ చేపట్టారు. తన సీనియర్ వల్లే గర్భం దాల్చినట్లు ఆ బాలిక పోలీసులకు తెలిపింది. పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!