1990 లో వచ్చిన ఈటివి “అంతరంగాలు” సీరియల్ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ సీరియల్ లో వచ్చే పాట “అంతరంగాలు అనంత మానస చదరంగాలు..” అంటూ సాగుతుంది. ఈ సీరియల్ గుర్తుంటే, అందులో హీరో అచ్యుత్ కూడా గుర్తుండే ఉంటారు. ఈ సీరియల్ తరువాత బాగా పాపులర్ అయిన అచ్యుత్ “తమ్ముడు” సినిమాలో కూడా నటించారు.
Advertisement
బాగా పాపులారిటీ సంపాదించిన రోజుల్లోనే మరింత సక్సెస్ అవుతాడని అందరు అనుకున్నారు. కానీ అంతలోనే అచ్యుత్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. 1964 లో రామారావు, సుజాత దంపతులకు అచ్యుత్ జన్మించారు. 1980 లలో అచ్యుత్ సినీ ఇండస్ట్రీలోకి రావడానికి నటన కోసం శిక్షణ తీసుకున్నారు. మొదటగా ఆయన సీరియల్స్ లో నటించారు. దూరదర్శన్ లో ప్రసారమైన ఇంద్ర ధనుస్సు సీరియల్ లో అచ్యుత్ తొలిసారి నటించారు. ఆ తరువాత వెన్నెల వేట, మిస్టర్ బ్రహ్మానందం, ప్రేమంటే ఇదే వంటి సీరియల్స్ లో నటించి పాపులర్ అయ్యారు.
బేబీ దర్శకత్వంలో వచ్చిన ఆదివారం అమావాస్య అనే హారర్ మూవీ లో అచ్యుత్ తొలిసారిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రేమ ఎంత మధురం, పట్టుదల, అమ్మ కొడుకు వంటి సినిమాలలో కూడా నటించారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరో గా వచ్చిన “తమ్ముడు” సినిమాలో పవన్ కు అన్నగా కనిపించి అలరించారు. అలాగే డాడీ సినిమాలో కూడా ఓ క్యారక్టర్ వేశారు. చిరంజీవి అభిమానిగా ఆయన సినిమాలో నటించడం తో అచ్యుత్ సంతోషపడ్డారు.
Advertisement
సినీ రంగంలో స్థిరపడ్డవారు వ్యాపారం కూడా చేస్తుండడం గమనించిన అచ్యుత్ తానూ వ్యాపారం చేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే నలభై లక్షలు అప్పు చేసి మరీ వినయ్ ప్రింటింగ్ ప్రెస్ ను ప్రారంభించారు. ఈ వ్యాపారం స్నేహితులకు అప్పగించారు అయితే ఇందులో నష్టాలు రావడంతో అప్పుల గురించి టెన్షన్ పడ్డారు. ఓ రోజు ఈ టెన్షన్ లోనే చల్లని కూల్ డ్రింక్ తాగుతూ ఉండగా ఉన్నట్లుండి గుండెపోటుకు గురి అయ్యారు. గుండెపోటు అని గ్రహించేలోపే ఆయన ప్రాణం ఈ లోకాన్ని వీడిపోయింది. ఆయనకు సుజాత, శివాని అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారు పసి వయసులో ఉండగానే, అచ్యుత్ ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన 7 క్రేజీ ప్రాజెక్ట్ లు ఇవే…!
మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మనకు కనిపించవు.. కారణం ఏంటంటే ?
గుంటల కోసం, పవన్ కళ్యాణ్ గుంట పూజ !