వండి టేబుల్ పై పెట్టిన ఆహారాన్ని ఎవరైనా తింటారు. కానీ ఆహారం తయారు కావడానికి దాని వెనుక ఎంతో కష్టం ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సొంతంగా వండుకొని, రుచిగా చేసుకొని తినడం చాలా కష్టమైన పని.. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ హైదరాబాదులో లేకముందు మన తెలుగు నటీనటులు ఎంతోమంది కష్టపడి యాషా, భాషా తెలియని ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఆఫర్లు దక్కించుకొని స్టార్ హీరోలుగా ఎదిగారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలిరావాలని మొట్టమొదటిసారిగా భావించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు.
also read:అయ్యో ఇళయరాజా..ఎంత పని అయిపోయింది అంటే..?
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిలను, రాజకీయ నాయకులను కలుపుకొని సినిమా తారలంతా ముకుమ్మడిగా హైదరాబాద్ కి మాఖం మార్చారు. వారు హైదరాబాద్ రావడానికి సినిమాలకు సంబంధించిన టాక్స్ కూడా ఒక కారణం, మన టాక్స్ మన రాష్ట్రానికే చెందాలని రాజకీయ నాయకులు సైతం కోరుకున్నారు. ఇక ఆలోచన వచ్చిందే తడవు స్టూడియోలు నిర్మించబడ్డాయి. స్టార్ హీరోలు అందరికీ రాష్ట్రం తరఫున ప్రభుత్వ భూములను విరాళంగా ఇచ్చారు. అలా మెల్లిమెల్లిగా మన సినిమాలన్నీ మన దగ్గరే షూటింగ్ జరుపుకోవడం మొదలుపెట్టారు.
Advertisement
also read:“నేను చస్తే తప్ప సినిమాలకు దూరం కాను”.. నరేష్ సంచలన వ్యాఖ్యలు..!
వాస్తవానికి ఏఎన్ఆర్ హైదరాబాద్ కి రావాలనుకోవడం వెనుక మరో ముఖ్య కారణం ఉంది. ఆయన పెద్ద కుమారుడు పెద్ద కుమార్తెను చర్చి స్కూల్లో చదివించారు. అక్కడ వారు ఉత్తరాలు రాస్తే ఇంగ్లీష్ లో ఉండేవి. అవి చదివించాలంటే చదువుకున్న వారిని ఆశ్రయించాల్సి వచ్చింది. ఇంత పెద్ద చదువులు చదువుకున్న ఎన్ని భాషలు నేర్చుకున్న మాతృభాషను మర్చిపోకూడదని ఆయన అనుకోవడంతోనే హైదరాబాదుకి వస్తే మాతృభాషా కచ్చితంగా మన లాంగ్వేజ్ గా ఉంటుంది కాబట్టి వారు నేర్చుకునే అవకాశం ఉంటుందని కుటుంబంతో సహా హైదరాబాద్ తరలివచ్చారు.
also read:అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా…?