సాధారణంగా ఐపీఎల్ టీ-20 క్రికెట్ అంటే ధనాదన్ ఫోర్లు, సిక్సర్ల మోత ఉండే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ముఖ్యంగా వెస్టిండిస్ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. డివిలీయర్స్, క్రిస్ గేల్ ఆర్సీబీ జట్టులో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ఐపీఎల్ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకున్న క్రిస్ గేల్ తిరిగి ధనాధన్ లీగ్ లోకి రాబోతున్నట్టు సమాచారం. అవునండి.. ఈ మాటలను స్వయంగా యూనివర్సల్ బాస్ చెప్పడం విశేషం.
Advertisement
ఇందుకు కారణం మరేదో కాదండోయ్.. గుజరాత్ టైటాన్స్ పై మ్యాచ్ గెలిస్తేనే ఐపీఎల్ ప్లే ఆప్స్ అన్న సమయంలో ఆర్సీబీ తరపున విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఓడిపోయినప్పటికీ విరాట్ కోహ్లీ పలు రికార్డులను సృష్టించాడు. హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ పై సెంచరీ చేసిన కోహ్లీ.. ఐపీఎల్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు.
Advertisement
సెంచరీ చేసిన మూడు రోజులకే క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును పూర్తిగా తన సొంతం చేసుకున్నాడు కోహ్లీ. గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కి ముందు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ 6 సెంచరీలతో ఐపీఎల్ క్రికెట్ లో అత్యధిక సెంచరీల రికార్డు కలిగి ఉన్నారు. కోహ్లీ గేల్ రికార్డును బద్దలు కొట్టడంతో దీనిపై స్పందించిన క్రిస్ గెల్ “ఐపీఎల్ లోకి తిరిగి వచ్చేస్తున్నా.. కాచుకో కోహ్లీ.. కాచుకో.. నేను రిటైర్ మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. వచ్చే ఏడాది నాతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉండు అంటూ గేల్ జోక్ చేశాడు. జియో సినిమాతో క్రిస్ గేల్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గేల్, కోహ్లీ కలిసి ఆర్సీబీలో ఆడాలని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ వారి ఆశ నిజమయ్యేనా ?
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :