Home » IPL 2023 : కోహ్లీని దారుణంగా అవమానించిన బచ్చా ప్లేయర్

IPL 2023 : కోహ్లీని దారుణంగా అవమానించిన బచ్చా ప్లేయర్

by Bunty

IPL 2023 ముగింపు దశకు వచ్చింది. మరో వారంలోనే ఐపిఎల్ 2023 టోర్నీ ముగియనుంది. అయితే ఈ తరుణంలోనే.ఐపిఎల్ 2023లో బెంగళూరు కథ ముగిసింది ఈసారైనా టైటిల్ ను గెలిచి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఆర్సిబికి మరోసారి నిరాశ ఎదురయింది. ప్లేఆఫ్స్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సిబి ఓటమి పాలైంది.

చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో బెంగుళూరు ఓటమి చవిచూసింది. 198 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంతో ఆర్సిబి బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 19.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇక ఈ మ్యాచ్ లో ఆర్సిబి ఓటమి పాలవ్వగానే కోహ్లీ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో గెలిచి ఉంటే ప్లేఆఫ్స్ లో లక్నోతో ఆర్సిబి… ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుండేది.

కానీ ఆర్సిబి ఓడిపోవడంతో…నవీన్ ఉల్ హక్ తన ఇన్ స్టా స్టోరీలో ఓ యాంకర్ నవ్వుతున్నట్లు ఉన్న వీడియోని పోస్ట్ చేశాడు. సరిగ్గా ఆర్సీబీ మ్యాచ్ తర్వాత ఇదే పెట్టాడు. దీంతో అందరికీ విషయం అర్థమైపోయింది. కావాలనే కోహ్లీని అవమానించేలా గొడవను మరింత పెద్దది చేయడం కోసమే ఇలా చేశాడని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Virupaksha : నల్ల కోడి ఎత్తుకుపోయేది క్షుద్ర పూజలకేనని ముందే హింట్ ఇచ్చిన దర్శకుడు

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మృతి

వెన్నెల కిషోర్ ఇంట్లో రూ.2 వేల నోట్ల కట్టలు.. శిక్ష తప్పదా?

Visitors Are Also Reading