Home » ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవీ విరమణ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..!!

ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవీ విరమణ.. ఇంట్రెస్టింగ్ స్టోరీ..!!

by Sravanthi Pandrala Pandrala

చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉంటుంది.. ఈ ఉద్యోగం వస్తే ఎంచక్కా ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా జీవించవచ్చని భావిస్తారు. అలా ఒక వ్యక్తి తన ప్రభుత్వ సాధించాలనే కళ నెరవేర్చుకున్నాడు. ఉద్యోగం వచ్చినా మూన్నాళ్ళ ముచ్చటగానే మారింది. ఉద్యోగంలో చేరిన 18 రోజులకే పదవి విరమణ చేయనున్నారు. వివరాలు ఏంటో చూద్దామా..

ఇటీవల డీఎస్సీ 1998 బ్యాచ్ కు ఏపీ గవర్నమెంట్ ఆయా స్కూళ్లలో ఒప్పంద ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. అలా ఎంపికైన వారిలో చాలామంది ఇప్పటికే వివిధ స్కూల్లోకి వెళ్లి రిపోర్ట్ ఇచ్చారు. ఈ బ్యాచ్లో నంద్యాల జిల్లా డోన్ కు చెందిన వివేక శాస్త్రి ఉన్నారు. ఆయన కూడా ఒక ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ పడింది. ఇంతకాలం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు.

ఇటీవల దేవనకొండ మండల విద్యాధికారిని వివేక శాస్త్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ నేను ఇటీవల సర్కార్ కొలువు సాధించాను. జూన్ 30వ తేదీన విరమణ పొందుతున్నాను. పాఠశాల ప్రారంభం 12వ తేదీన కానున్నాయి. నేను కేవలం 18 రోజులు మాత్రమే విధులు నిర్వర్తించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ కావాలన్నది నా కల. అందుకే 18 రోజులకే పదవి విరమణ ఉంటుందని తెలిసి కూడా కొలువులో చేరానని ఆయన అన్నారు. తన 25 ఏళ్ల కళ కేవలం 18 రోజుల్లోనే ముగిసిపోవడంతో కాస్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు వివేకాశాస్త్రి.
మరికొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading