ఏపీలో సినిమా టికెట్ల వివాదం కొలిక్కి వచ్చిందనుకుంటే ఇప్పుడు మరో వివాదం మొదలైంది.మెగాస్టార్ చిరంజీవి ముందుండి సినిమా టికెట్ల ఇష్యూను పరిష్కరించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దాంతో సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవిని ఇంటికి పిలిచి అతిధి మర్యాదలు చేసి సమస్యలను పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం టాలీవుడ్ కు చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
Advertisement
అయితే ఈ భేటీలో చిరంజీవి జగన్ కు మీరు తండ్రి లాంటి వారు అంటూ చేతులెత్తి దండపెడుతూ వేడుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి అంతతగ్గినా జగన్ మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శలు వస్తున్నాయి. మెగా అభిమానులు ఈ విషయంపై మండిపడుతున్నారు. దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయం పై చిరంజీవి అలా అడగటం తనను బాధించిందని అన్నారు.
Advertisement
అయితే సినిమా టికెట్ల వివాదం మొదలైంది మాత్రం చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో చేసిన కామెంట్ల వల్లే ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే చిరంజీవి సీఎం జగన్ ను సమావేశం లో వేడుకోవడం పవన్ కు కూడా నచ్చలేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంతే కాకుండా పవన్ కల్యాణ్ దీనిపై ఘాటుగా స్పందించాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కానీ చిరంజీవి మాత్రం సినిమా సమస్య పరిష్కారం అవుతుందని ఇలాంటి సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదని పవన్ కల్యాణ్ వద్ద ప్రామిస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అందువల్లే పవన్ కల్యాణ్ మౌనంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.