Home » Chiranjeevi: హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన తప్పు ! నెటిజన్స్ ట్రోలింగ్ !

Chiranjeevi: హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి చేసిన తప్పు ! నెటిజన్స్ ట్రోలింగ్ !

by Sravya
Ad

సంక్రాంతి బరి లో హనుమాన్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాలో హీరోగా తేజ సబ్జా నటించాడు. తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాడు. నెమ్మదిగా హీరోగా అవకాశాలని పొందుతున్నాడు తేజ.

Chiranjeevi-in-hanuman-pre-release-event

Chiranjeevi-in-hanuman-pre-release-event

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సంక్రాంతి బరిలోకి హనుమాన్ సినిమా రాబోతోంది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా జరుపుకోవడం జరిగింది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈవెంట్ కి వచ్చిన చిరంజీవి కొత్త వివాదం లో ఇరుక్కున్నారు ఇప్పటికీ మూవీ ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.

Advertisement

Advertisement

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా వచ్చిన చిరు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఈవెంట్ కి స్టేజి మీదకి వచ్చే ప్రతి ఒక్కరూ చెప్పులు విడిచి వచ్చారు. చిరంజీవి మాత్రం చెప్పులు వేసుకుని వచ్చారు. దీంతో హనుమంతుడు భక్తుడు ఆయన చిరు ఇలా చెప్పులు వేసుకుని రావడం ఏంటని అంతా అంటున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అయింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ఎందుకు ఇలా వచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్ మొదట్లో సుమ మాట్లాడుతూ ఈరోజు ఈవెంట్లో ఎవరూ చెప్పులు వేసుకోలేదని చెప్పారు.

ఆమె చెప్పినట్టుగానే స్టేజ్ మీదకు వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పులు విడిచి వచ్చారు. ముందు నుండి కూడా హనుమాన్ భక్తుడని చెప్పుకునే చిరంజీవి మాత్రం చెప్పులు వేసుకుని వచ్చారు. ప్రస్తుతము ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఇది ఇలా ఉంటే హనుమాన్ సినిమాలో తేజ సజ్జ, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ టీజర్ ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్ ని కూడా అంత పెట్టుకున్నారు మరి సినిమా ఎలా అలరిస్తుంది అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading