Home » CHIRU-BALAYYA:వీరసింహారెడ్డి vs వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి బరిలో బాలయ్య చిరు ఢీ..!

CHIRU-BALAYYA:వీరసింహారెడ్డి vs వాల్తేరు వీరయ్య.. సంక్రాంతి బరిలో బాలయ్య చిరు ఢీ..!

by Sravanthi Pandrala Pandrala

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. ఇక తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ చిరంజీవి ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ వస్తే అభిమానులకు పండగే పండగ.. సరిగ్గా 6 సంవత్సరాల తర్వాత మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఒకరికొకరు ఢీకొట్టడానికి రెడీ అయ్యారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీతో, బాలకృష్ణ వీర సింహారెడ్డితో బరిలోకి దిగనున్నారు.

ఈ రెండు చిత్రాలకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరించడం మరో విశేషం. అయితే ఈ సినిమాను సంక్రాంతి వేల రిలీజ్ చేయాలని ఇప్పటికే ప్రకటించారు. మరి ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి పోటీలో నిలబడడం వల్ల చిత్ర యూనిట్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే చాలా సినిమాలతో బాలయ్య-చిరంజీవి పోటీలో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా సంక్రాంతి బరిలో అనేకసార్లు సార్లు చిరంజీవి బాలకృష్ణ పోటీపడ్డారు. మరి ఆ చిత్రాలు ఏంటో చూద్దాం..
#1. ఆత్మబలం-చట్టంతో పోరాటం :

1985 లో చిరంజీవి “చట్టంతో పోరాటం” సినిమాతో జనవరి 5న వచ్చారు. సరిగ్గా రెండు వారాల గ్యాప్ తో 11న బాలకృష్ణ “ఆత్మబలం” సినిమా వచ్చింది..
#2. దొంగ మొగుడు- భార్గవ రాముడు :

1980లో సంక్రాంతి సీజన్ లో వన్ వీక్ గ్యాప్ తో చిరంజీవి జనవరి 7న “దొంగ మొగుడు” తో పలకరించారు. అటు బాలకృష్ణ మూవీ జనవరి 14న “భార్గవరాముడు”తో బరిలోకి దిగారు.
#3. మంచి దొంగ- ఇన్స్పెక్టర్ ప్రతాప్ :

1988 జనవరి 14న రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి “మంచి దొంగ” చిత్రంతో వస్తే, ఒకే రోజు గ్యాప్ తో 1988 జనవరి 15న “ఇన్స్పెక్టర్ ప్రతాప్” తో పలకరించారు బాలకృష్ణ.

also read:మీరు టీ తాగేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి..!

#4. ఖైదీ నెంబర్ 150- గౌతమీపుత్ర శాతకర్ణి :

మెగాస్టార్ చిరు హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ “ఖైదీ నెంబర్ 150”.. జనవరి 11 2017 లో విడుదలైంది. అదేవిధంగా జనవరి 12న క్రిష్ డైరెక్షన్లో వచ్చిన “గౌతమీపుత్ర శాతకర్ణి” మూవీతో బాలకృష్ణ వచ్చారు.
#5. సమరసింహారెడ్డి- స్నేహం కోసం :

1999 జనవరి 1న చిరంజీవి స్నేహం కోసం మూవీ వచ్చింది. ఆ తర్వాత రెండు వారాల గ్యాప్ తో బాలకృష్ణ హీరోగా “సమరసింహారెడ్డి” తో వచ్చారు.

also read:

Visitors Are Also Reading