Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » అలాంటివి అంటే అసహ్యమంటున్న సాయిపల్లవి..! 

అలాంటివి అంటే అసహ్యమంటున్న సాయిపల్లవి..! 

by Anji
Ads

టాలీవుడ్ లో ప్రముఖ కథానాయికలలో సాయి పల్లవి ఒకరు. ఈమె వైద్య విద్యనభ్యసించినప్పటికీ నటీగా మారింది. ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది. ప్రేమమ్ చిత్ర విజయంతో దక్షిణాది సినీ పరిశ్రమలో మారుమ్రోగింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈమె తొలుత టీవీ ఛానల్ లో డ్యాన్స్ పోటీల్లో పాల్గొనడం ద్వారానే సినీ అవకాశాలను దక్కించుకుంది. 

Advertisement

Ad

అయితే ఈమె ఇప్పుడు అలాంటి డ్యాన్స్ పోటీలనే విమర్శించడం విశేషం. అలాంటి పోటీలపై తనకు నమ్మకం లేదని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. తమిళంలో విజయ్ టీవీలలో ప్రసారమయ్యే ఉంగళిల్ యార్ అడుత్త ప్రభుదేవా అనే డ్యాన్స్ పోటీల కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి ఆ పోటీలలో ద్వితీయ బహుమతికే పరిమితమైంది. అదే ఆమెను బాధ పెట్టినట్టయింది. ప్రథమ బహుమతి గెలుచుకోవడానికి కారణం ధనబలం అంటూ తన అక్కసుని వెళ్లగక్కింది. దీని గురించి ఇటీవల ఆమె ఒక భేటీలో పేర్కొంటూ డ్యాన్స్ పోటీలలో ప్రతిభకు ఎప్పుడూ గౌరవం లేదని పేర్కొంది. 

Also Read : ఆదిపురుష్ బాటలోనే సమంత నటించిన శాకుతలం..!

Manam News

సాధారణంగా టీవీ ఛానళ్లలో డబ్బుకే అత్యంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పింది. లేకపోతే ప్రముఖుల వారసులకు అలాంటి మర్యాద ఇస్తారని, అందుకే తనకు డ్యాన్స్ పోటీలంటే నమ్మకం లేదని అలాంటి వంటే అసహ్యం అంటూ ఆరోపణ చేసింది. ఈ నటి ఆ మధ్య ప్రభుదేవా నృత్య  దర్శకత్వంలో ధనుష్ తో కలిసి రౌడీబేబీ అనే పాటలో నటించింది. ఆ పాటలో ధనుష్ తో కలిసి చేసిన డ్యాన్స్ కి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే.

Advertisement

Also Read :  ప్రేమి విశ్వనాథ్ ఆస్తి విలువ ఎంతో తెలుసా ? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

 

Visitors Are Also Reading