Home » చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా దెబ్బతీసిన ఆ సినిమా ఏదో తెలుసా..?

చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా దెబ్బతీసిన ఆ సినిమా ఏదో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు.. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అత్యంత ఘనత సాధించారు. చిరంజీవి కెరీర్లో అత్యంత హిట్ సినిమాల లిస్టు చూస్తే గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠామేస్త్రి లాంటి చిత్రాలు ఉన్నాయి.

Advertisement

హిట్లర్ మూవీ తో మంచి ఫామ్ లోకి వచ్చారు చిరంజీవి. దీని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. కష్టకాలంలో ఆయనకు హిట్ ఇచ్చిన ముత్యాల సుబ్బయ్యకు చిరంజీవికి కృతజ్ఞత ఉంది. ఆయనతో సినిమా చేద్దాం అనుకున్నారు.. ఈ మూవీ తర్వాత మాస్టర్, బావగారు బాగున్నారా,ఇద్దరు మిత్రులు, స్నేహం కోసం ఇలా అన్ని సినిమాలు ఫ్యామిలీ ఓరియంటెడ్ రేంజ్ లో వచ్చాయి. కానీ తన కంఫర్ట్ జోన్ లో సినిమాలు చేసి చాలా రోజులు అవుతుంది. అలాంటి మూవీ ఉంటేనే ఒకటి చేయాలనుకున్నారు చిరు. ఈ విషయాన్ని అల్లు అరవింద్ కు చెప్పారు.

Advertisement

గీత ఆర్ట్స్ లోనే మూవీ చేద్దాం అనుకున్నారు. ఈ విధంగా అల్లు అరవింద్ రైటర్ భూపతి రాజా కలిసి కథ రాయించారు. చిరంజీవి కి కథ నచ్చింది. హీరోయిన్గా సౌందర్యని ఎంపిక చేశారు. కానీ డైరెక్టర్ ఎవరో అల్లు అరవింద్ కు అర్థం కావడం లేదు. చివరికి ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్ అని చెప్పగానే అల్లు అరవింద్ వెంటనే ఆయన వద్దకు వెళ్లి అడ్వాన్స్ ఇచ్చారు.సినిమా షూటింగ్ పూర్తయింది. ఆడియో కూడా రిలీజ్ అయింది. సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. చిరంజీవి స్టిల్స్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2000 సంవత్సరం జనవరి 7న సినిమా 200 పైగా థియేటర్లో విడుదలైంది అన్నయ్య మూవీ. చిరు ఫ్యాన్స్ కు బాగా నచ్చింది.

ఈ విధంగా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య అప్పుడు చెల్లెల్ల సెంటిమెంటుతో హిట్లర్, ఇప్పుడు తమ్ముళ్ల సెంటిమెంటుతో అన్నయ్య సినిమా తో చిరంజీవికి రెండు సూపర్ హిట్ లు ఇచ్చారు. 25 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటివారం దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు ఓపక్క వెంకటేష్ హీరోగా కలిసుందాం రా మూవీ వచ్చింది. మరో పక్క బాలకృష్ణ వంశోద్ధారకుడు , మోహన్ బాబు పోస్ట్ మాన్ లాంటి సినిమాలు ఫుల్ పోటీ ఇచ్చాయి. అయినా చిరంజీవి సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోయింది. కలిసుందాం రా లాంటి ఫ్యామిలీ మూవీ వల్ల క్లాస్ సెంటర్స్ లో అన్నయ్య చిత్రానికి కాస్త దెబ్బ పడింది అని చెప్పవచ్చు. లేదంటే ముందే చెప్పుకున్నట్టు ఇండస్ట్రీ హిట్ అయ్యేది.

also read:

Visitors Are Also Reading