వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ నటుడు చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్న ఆయన.. విభజన సమయంలో జరిగిన సంఘటనలతోపాటు చిరంజీవి రాజకీయం గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ఈ మేరకు ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పారు. అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో తనను ముఖ్యమంత్రి కాకుండా చిరు అడ్డుపడ్డాడంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Advertisement
Advertisement
బోత్స మాట్లాడుతూ.. ‘నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ దానిని చిరంజీవి అడ్డుకున్నారు. చిరు తనకు, తన ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ ముఖ్యమంత్రి అవకాశం లభించకూడదనే మనస్తత్వంతో ఉండేవారు. నిజానికి చిరును నేను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాను. నేను ముఖ్యమంత్రి అయితే చిరు సామాజిక వర్గానికి న్యాయం చేసేవాడిని’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాగే విభజన సమయంలో జరిగిన సంఘటనలపై త్వరలోనే ఒక పుస్తకం రాయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం మంత్రి బొత్స వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ వ్యూహాత్మకంగానే చిరంజీవి పేరు ప్రస్తావిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఎన్ఐఈఎల్ఐటీ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం