Home » అల్లు ఫ్యామిలీతో గొడ‌వ‌లు…ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!

అల్లు ఫ్యామిలీతో గొడ‌వ‌లు…ఒక్క ఫోటోతో ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!

by AJAY

ఇండ‌స్ట్రీలో కొన్ని వార్తలు ఎలాంటి ఆధారాలు లేకుండానే వినిపిస్తుంటాయి. అలాంటి వార్త‌నే ఒక‌టి అల్లు మెగా ఫ్యామిలీల గురించి కూడా వినిపిస్తోంది. చిరంజీవి అల్లు అర్జున్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చాయని చాలా కాలంగా వార్త‌లు గుప్పుమంటున్నాయి. దానికి కార‌ణం అల్లు అర‌వింద్ కు బాల‌య్య ద‌గ్గ‌ర‌వ్వ‌డం కూడా ఒక కార‌ణ‌మే. అంతే కాకుండా అన్ స్టాప‌బుల్ నుండి త‌న‌కు ఆహ్వానం అంద‌లేద‌ని చిరు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

దాంతో ఆ అనుమానాలు మ‌రింత ఎక్కువ అయ్యాయి. అయితే తాజాగా చిరంజీవి ఒక్క ఫోటోతో ఆ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. మంగ‌ళవారంతో అల్లు అర్జున్ సినీప్ర‌స్థానానికి 20 ఏళ్లు పూర్త‌య్యాయి. దాంతో ప‌లువురు సెల‌బ్రెటీలు అల్లు అర్జున్ కు సోష‌ల్ మీడియాలో అభినంద‌న‌లు తెలుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవితో క‌లిసి దిగిన ఓల్డ్ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

అంతే కాకుండా ఆ ఫోటోకు డియ‌ర్ బ‌న్నీ నువ్వు సినీప‌రిశ్ర‌మ‌లో 20 ఏళ్లు పూర్తిచేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నీ చిన్న నాటి జ్ఞాప‌కాలు ఇంకా నా మ‌దిలో ఉన్నాయి. కానీ కాలం ఎంత వేగంగా ప‌రిగెడుతోంది క‌దా.. న‌టుడుగా కెరీర్ ను ప్రారంభించిన నువ్వు కెరీర్ ను అద్భుతంగా మ‌లుచుకున్నారు. సాధార‌ణ న‌టుడు నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగావు. నువ్వు మ‌రెన్నో విజ‌యాల‌ను మ‌రెన్నో హృద‌యాల‌ను గెలుచుకోవాల‌ని కోరుకుంటున్నా…అంటూ చిరు త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

ALSO READ : విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..”పుష్ప” ఐటెం సాంగ్ వద్దన్నారంటూ !

Visitors Are Also Reading