మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. సినిమా ఇండస్ట్రీకి తాను పెద్దగా ఉండనని అన్నారు. ఇండస్ట్రీకి పెద్ద అనే హోదా తనకు వద్దని అన్నారు. పెద్దరికం అనే హోదా తనకు ఇష్టం లేదని మెగాస్టార్ స్పష్టం చేశారు. చిరంజీవి ఆదివారం నాడు సినీ కార్మికులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొందరు కార్మికులు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరని సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకునేవారు లేరని మెగాస్టార్ కు తెలిపారు.
ఆ బాధ్యతను మెగాస్టార్ తీసుకోవాలని కోరుతున్నామని సమస్య వచ్చినప్పుడు తమకు దైర్యంగా ఉంటుందని అన్నారు. దాంతో మైక్ తీసుకుని చిరంజీవి మాట్లాడుతూ…సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా తాను ఉండనని స్పష్టం చేశారు. పెద్దరికం అనే హోదా తనకు వద్దని అన్నారు. కానీ సినిమా కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా తాను వస్తానని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తననను కలవచ్చని అన్నారు. అయితే యూనియన్ల మధ్య జరిగిన గొడవలు పంచాయితీలతో మాత్రం తన వద్దకు రాకూడదని చెప్పారు.
Advertisement
Advertisement
also read : BIGG BOSS-5 : దీప్తి- షణ్ముక్ ల బ్రేకప్ తరవాత తొలిసారి స్పందించిన సిరి…!
ఆరోగ్యం,ఉపాది ఇలా ఏ కార్యక్రమం అయినా తాము ఉంటానని కార్మికులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా గతంలో ప్రముఖ దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు సినిమా పరిశ్రమలకు పెద్దదిక్కుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తరవాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవర్నది హాట్ టాపిక్ గా మారింది. మా ఎన్నికల సమయంలో కూడా ఇదే విషయం తరచూ తెరపైకి వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చేసిన కామెంట్లతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది.
also read : ఈ స్టార్లు సినిమాల్లో సూపర్ హిట్..రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్…!