Home » BIGG BOSS-5 : దీప్తి- ష‌ణ్ముక్ ల బ్రేక‌ప్ త‌ర‌వాత తొలిసారి స్పందించిన సిరి…!

BIGG BOSS-5 : దీప్తి- ష‌ణ్ముక్ ల బ్రేక‌ప్ త‌ర‌వాత తొలిసారి స్పందించిన సిరి…!

by Ajay

న్యూయ‌ర్ కు ఒక‌రోజు ముందు త‌న ప్రియుడికి బ్రేకప్ చెబుతూ దీప్తి సున‌య‌నా సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఐదేళ్లుగా రిలేష‌న్ షిప్ లో ఉన్నామ‌ని కానీ సంతోషంతో పాటూ గొడ‌వ‌లు కూడా ఉన్నాయ‌ని దీప్తి వెల్ల‌డించింది. కానీ దీప్తి ష‌ణ్ముక్ బిగ్ బాస్ లో ఉన్నంత కాలం అత‌డికి స‌పోర్ట్ చేసింది. ఓ వైపు స‌పోర్ట్ చేస్తూనే మార్పు త‌ప్ప‌దు అంటూ విడిపోతున్న‌ట్టు హింట్ ఇచ్చింది. ఇక హౌస్ నుండి వ‌చ్చాక ష‌ణ్ముక్ ను బ్లాక్ చేసిన‌ట్టు స‌మాచారం. అనంతరం చివ‌ర‌కు తాము విడిపోతున్నామని బాంబు పేల్చింది.

దాంతో ష‌ణ్ముక్ కూడా విడిపోవడం ఆమె ఇష్టం అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పి గుడ్ బై చెప్పాడు. ఇదిలా ఉంటే దీప్తి ష‌ణ్ముక్ లు విడిపోవడానికి కార‌ణం బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి నే అని అటు ష‌ణ్ముక్ అభిమానులు ఇటు దీప్తి అభిమానులు ఫైర్ అవుతున్నారు. హౌస్ లో ముద్దులు హ‌గ్గుల వ‌ల్లే దీప్తి హ‌ర్ట్ అయ్యింద‌ని భావిస్తున్నారు. లేదంటే ఇద్ద‌రూ ఎంతో క‌లిసి మెలిసి ఉండేవారని హౌస్ లో జ‌రిగిన పెంట వ‌ల్లే ఇలా జ‌రిగిందంటూ సిరిపై నింద‌లు వేస్తున్నారు.

deepthi sunaina shanmuk breakup

deepthi sunaina shanmuk breakup

ఇక తాజాగా ష‌ణ్ముక్ దీప్తి ల బ్రేక‌ప్ త‌ర‌వాత సిరి మొద‌టి సారి సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఎవ‌రైనా మీ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మీ జీవితం చాలా క‌ఠినంగా ఉందే అని అంటే..వాటి కంటే నేను మ‌రింత స్ట్రాంగ్ అని న‌వ్వుతూ స‌మాధానం చెప్పండి అంటూ ప్ర‌ముఖ మోటివేష‌న‌ల్ స్పీక‌ర్ మునిబా మ‌జారి చెప్పిన మాట‌ల‌ను సిరి షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ తో సిరి ష‌ణ్ముక్ ను స్ట్రాంగ్ గా ఉండ‌మ‌ని…అత‌డికి స‌పోర్ట్ చేసింద‌ని నెటిజ‌న్లు భావిస్తున్నారు.

ALSO READ : త‌గ్గేదే లే అంటూ వార్న‌ర్ బాబాయ్ బ్యాక్…ఫ్యాన్స్ కుషీ..!

You may also like