Home » పోలీస్ స్టోరీ సినిమాను ప్రమోట్ చేయను అని చెప్పిన చిరంజీవి.. ఎందుకో తెలుసా ?

పోలీస్ స్టోరీ సినిమాను ప్రమోట్ చేయను అని చెప్పిన చిరంజీవి.. ఎందుకో తెలుసా ?

by Anji
Ad

నటుడు, దర్శకుడు, ఫైట్ మాస్టర్  థ్రిల్లర్ మంజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో 1996లో తెరకెక్కిన పోలీస్ స్టోరీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ యాక్షన్ సినిమాలలో సాయికుమార్, శోభరాజ్, సత్య ప్రకాశ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో సాయి కుమార్ వేసిన అగ్నిపాత్ర బంపర్ హిట్ అయింది. ఈ సినిమాకి ముందు వరకు సాయికుమార్ పెద్దగా గుర్తింపు లభించలేదు.

Advertisement

అందుకే మేకర్స్ ఎవరైనా పెద్ద హీరోతో ఈ సినిమాని ప్రమోట్ చేయించాలనుకున్నారు. అప్పుడు సాయికుమార్ చిరంజీవి వద్దకు వెళ్లి తాను నటించిన పోలీస్ స్టోరీ సినిమా గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలని అడిగాడట. ఏదైనా అడుగు.. కానీ ఇలాంటివి అడిగి ఇబ్బంది పెట్టకు రా.. అని చెప్పాడట చిరంజీవి. ఈ విషయాన్ని తాజాగా సాయికుమార్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సాయికుమార్ పట్టుబట్టడంతో చాలా కోప్పడ్డాడట చిరంజీవి. సినిమా బాగుందని చెప్పేస్తే.. నా మాట విని చాలా మంది ప్రేక్షకులు సినిమా చూసేందుకు వెళ్తారు. సినిమా బాగోలేకపోతే నన్ను తిట్టుకుంటారు.. ఆ తలనొప్పి ఎందుకురా అని సాయికుమార్ ని పంపించే ప్రయత్నం చేశాడట చిరంజీవి. కానీ సాయికుమార్ మాత్రం అన్నయ్య మీరు చెప్పాల్సిందే.. నా సినిమాని ప్రమోట్ చేయాల్సిందే అని పట్టు పట్టాడట. కావాలంటే సినిమాని చూడండి.. నచ్చితే నచ్చిందని.. లేకపోతే లేదని చెప్పమని చిరంజీవిని బతిమిలాడట.

Advertisement

 

అప్పట్లో చిరంజీవి హిట్లర్ వంటి సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నాడు. సాయికుమార్ మాట కాదనలేక పోలీస్ స్టోరీ సినిమా చూస్తానని హామీ ఇచ్చాడు. తరువాత సాయికుమార్ అన్నపూర్ణ స్టూడియో లో చిరంజీవి పోలీస్ స్టోరీ సినిమా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒకరోజు చిరంజీవి తన భార్యతో కలిసి పోలీస్ స్టోరీ సినిమా చూసేందుకు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. సినిమా చూశాక రెండు నిమిషాలు సైలెంట్ గా ఉన్నాడట. తరువాత కుర్చీలోంచి లేచి సాయికుమర్ మెడ పట్టుకొని.. అరేయ్ ఏం నటించావు రా.. సినిమా సూపర్.. ఓ వీడియో చేసి ప్రమోట్ చేస్తానని మాటిచ్చాడట. ప్రస్తుతం సాయికుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read : అల్లు రామలింగయ్య ఎంత చెప్పినా వినకుండా ఆ సినిమా చేసి చిరంజీవి ఫ్లాప్ అందుకున్నాడా..?

Visitors Are Also Reading