టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారుండరు. ఈయనకు ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. ముఖ్యంగా మెగాస్టార్ చేసిన ప్రతీ సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు 40 ఏళ్ల పాటు ఇండస్ట్రీలోఅగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో చిరంజీవి కొత్త సినిమాలను చేస్తూ.. యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు.
Advertisement
ఇలాంటి క్రమంలోనే ఒకానొక సమయంలో చిరంజీవి చాలా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. వరుసగా 6 ఇండస్ట్రీ హిట్ సినిమాలను కొట్టిన ఏకైక హీరోగా కూడా చిరంజీవి తనదైన మార్క్ గుర్తు తెచ్చుకున్నాడు. ఇలాంటి క్రమంలో చిరంజీవి వాళ్ల మామయ్య అల్లు రామలింగయ్య ఒక సినిమా విషయంలో చిరంజీవిని ముందుగానే హెచ్చరించినప్పటికీ ఆయన అలాంటివి ఏమీ పట్టించుకోకుండా సినిమా చేసి భారీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. ఆ సినిమానే విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్.
Advertisement
ఈ సినిమా స్టోరీ విన్న చిరంజీవి ఆ స్టోరీని అల్లు రామలింగయ్యతో చెప్పాడట. అల్లు రామలింగయ్య ఆ కథలో పెద్దగా స్పార్క్ లేదు. నువ్వు చేయకపోతే బెటర్. అని మార్పులు చేర్పులు చేపించాడు అల్లు రామలింగయ్య. ఎన్ని మార్పులు, చేర్పులు చేసినప్పటికీ ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. ఇక అప్పటి నుంచి ఎవ్వరూ ఏం చెప్పినా కూడా మనం దాని గురించి ఒకసారి వినాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడట. అప్పటి నుంచి ఇప్పటిరవరకు చిరంజీవి విన్న ప్రతీస్టోరీ లో కొంతమంది సలహాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.
Also Read : నాగచైతన్య ని వద్దని అఖిల్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకున్న నాగార్జున.. కారణం అదేనా..?