సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోహీరోయిన్ లు ప్రేమించుకున్నారు. అయితేఅందులో కొంతమంది మాత్రమే పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్నవాళ్లలో కొందరు మాత్రమే కలిసి ఉంటున్నారు. అలా కలిసి ఉంటున్న జంటల్లో హీరో శ్రీకాంత్ ఊహల జంట కూడా ఒకటి. శ్రీకాంత్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో ఊహ కూడా స్టార్ హీరోయిన్ గా రానిస్తుంది. కాగా వీరిద్దరి మనసులు కలవడంతో ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
Advertisement
శ్రీకాంత్ ఊహ కలిసి నాలుగు సినిమాలలో నటించారు. ఆ సమయంలో వీరి మధ్య బంధం మరింత బలపడింది. ఆ తరవాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా పరిచయం అయ్యాడు కూడా.
Advertisement
అయితే శ్రీకాంత్ ఊహల పెళ్లి జరగడానికి కారణం చిరంజీవి అన్న సంగతి చాలా మందికి తెలియుదు. శ్రీకాంత్ ఊహల పెళ్లితో మెగాస్టార్ కు సంబంధం ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం…శ్రీకాంత్ తో ఊహ ప్రేమలో ఉందని తెలిసిన వెంటనే వారి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.
కానీ ఊహకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఇక విషయం చిరంజీవికి తెలియడంతో వెంటనే చిరు వెళ్లి ఊహ తల్లిదండ్రులతో మాట్లాడారు. అంత పెద్ద స్టార్ వచ్చి శ్రీకాంత్ గురించి చెప్పడంతో ఊహ తల్లిదండ్రులు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక అప్పటి నుండి శ్రీకాంత్ కు చిరంజీవి అంటే చాలా అభిమానం. చిరును ఆయన అన్నయ్య అనిపిలుస్తుంటాడు. ఇక చిరంజీవి కూడా శ్రీకాంత్ ను తమ్ముడిలానే చూసుకుంటాడు.
ALSO READ : అకీరా చేసిన పనికి హర్ట్ అవుతున్న పవన్ ఫ్యాన్స్…ఏం చేశాడంటే..?