ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తరవాత తరంలో స్టార్ హీరోలుగా రానించి ప్రస్తుతం కూడా స్టార్ లుగా రానిస్తున్న హీరోలు బాలకృష్ణ,చిరంజీవి. వీరిద్దరూ రీసెంట్ గా సంక్రాంతికి సైతం బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. కుర్రహీరోలను పక్కకు నెట్టేసే రేంజ్ లో వీరి సినిమాలకు కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇక వీరిలో బాలకృష్ణ ఎన్టీఆర్ నటవారసుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
Advertisement
మాస్ సినిమాలతో నట విశ్వరూపం చూపిస్తూ రికార్డుల మోతమోగిస్తున్నాడు. ఇక చిరంజీవి సొంతటాలెంట్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన చిరంజీవి అతితక్కువ కాలంలో స్టార్ గా ఎదిగాడు. ఆ తరవాత అల్లురామలింగయ్య అల్లుడు అయ్యే స్థాయికి చేరుకున్నాడు.
Advertisement
మధ్యలో సినిమాలకు గుడ్ బై చెప్పినా తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల పరంగా బాలయ్య చిరంజీవి చాలా సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ చేసుకున్నారు. కానీ బయట మాత్రం ఇద్దరూ ఎంతో క్లోజ్ గా ఉంటారు. చిరంజీవి పెద్ద కూతురు పెళ్లిలో బాలయ్య స్టెప్పులు వేశాడు.
అంతే కాకుండా బాలయ్య నటించిన గౌతమీపుత్రశాతకర్ణి సినిమా ఫంక్షన్ కు చిరంజీవి వచ్చి సపోర్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఆదిత్య 369 సినిమాకు కూడా చిరంజీవి ప్రమోషన్స్ చేశారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. సినిమా విడుదలకు ముందే క్రేజ్ కోసం నిర్మాత ఓ యాడ్ చేయాలని కోరగా చిరు వెంటనే ఓకే చెప్పి ఆ యాడ్ లో నటించాడట.
also read : కులం గురించి మాట్లాడకపోతే నరుకుతామన్నారు..జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు..!